రైతుల రుణాల రీషెడ్యూల్ విషయంలో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం సరైన సమాచారం ఇవ్వలేదని ఆర్బిఐ ఒక నిర్ధారణకు వచ్చినట్లు కధనాలు వస్తున్నాయి.ప్రత్యేకించి గత ఏడాధి ఖరీఫ్ లో పంటలు పండాయా?లేదా అన్నదానిపై సరైన వివరణ ఇవ్వలేదన్నది రిజర్వు బ్యాంక్ భావనగా ఉంది.అంతేకాక,మండలాలవారీగా పంటల వివరాలు సేకరించినప్పుడు అంతకుముందు సంవత్సరాల కన్నా పంట దిగుబడి తగ్గలేదని వెల్లడైందని రిజర్వు బ్యాంక్ అబిప్రాయపడిందని చెబుతున్నారు.ఏభై శాతం పంట దిగుబడి తగ్గితేనే రీషెెడ్యూల్ చేయడానికి బ్యాంకుల నిబంధనలు అనుమతిస్తాయి. ఈ నేపధ్యంలో కేవలం రుణమాఫీ చేయడం కోసం , రీషెడ్యూల్ ద్వారా ప్రయత్నాలు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదని ఆర్బిఐ సందేహిస్తోందని అంటున్నారు. దీనిని బట్టి రుణాల రీషెడ్యూల్ కు తక్కువ అవకాశం ఉన్నట్లు కనబడుతోంది.అందువల్లనే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఏకమొత్తం గా నలభై వేల కోట్లు సేకరించి రుణమాఫీ చేయాలని యోచన చేస్తున్నదని భావించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: