జనసేన పార్టీ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రారంభించే పనిలో పవర్-స్టార్ పవన్-కళ్యాణ్ బిజీగా ఉన్నారు. పూర్తిస్థాయి రాజకీయాలపై దృష్టి పెట్టాలని ఫిక్స్ అయిన గబ్బర్-సింగ్ అయిదు రాష్ట్రాలకు అడ్-హాక్ కమిటీలు ప్రకటించడానికి కసరత్తు ప్రారంభించారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇక పూర్తిస్థాయి రాజకీయాలపై దృష్టి పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఐదు రాష్ట్రాలకు అడ్-హాక్ కమిటీలు ప్రకటించే ఆలోచనలో ఉన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఒడిషా రాష్ట్రాలకు ఆగస్టు 15 కల్లా జనసేన పార్టీ కమిటీలు ప్రకటించే అవకాశముందంటున్నారు. ఈ లోగా పార్టీ కార్యాలయం పనులు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేయాలని పవన్ భావిస్తున్నట్లు సమాచారం. పిడికిలి గుర్తును పార్టీ గుర్తుగా జనాల్లోకి తీసుకెళ్లాలన్నది పవన్ కల్యాణ్ ఆలోచనగా చెప్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఆ గుర్తును రూపొందించే పనిలో ఉన్నారంటున్నారు. జనసేన పునాదులను పటిష్టంగా నిర్మించాలనుకుంటున్న పవన్... ఏపీ, తెలంగాణాల్లో టిడిపి, బిజెపిలతో దోస్తీ కట్టి ముందుకు సాగుతారని వినిపిస్తోంది. తమిళనాడు, ఒడిషా, కర్ణాటకల్లో తెలుగు ప్రజలు ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న ప్రాంతాల్లో పవర్ ఇమేజ్-తో ఆయన అడుగులు వేస్తారంటున్నారు. అలాగే కేంద్రంలో బిజెపి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి అధికారంలో ఉండటంతో జనసేన పార్టీ తరపున తన అనుయాయులకు ఆయన నామినేటెడ్ పోస్ట్-లు ఇప్పించుకునే ఆలోచనలో ఉన్నారట. ఆ క్రమంలో ప్రత్యక్ష ఎన్నికల్లో అరంగేట్రం చేసి జిహెచ్ఎంసి ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని పవర్-స్టార్ పట్టుదలగా ఉన్నారంట. 

మరింత సమాచారం తెలుసుకోండి: