సచివాలయంలో ఉన్నట్టుండి హుండీలు పెట్టారు... తర్వాత ఎందుకో వాటిని తొలగించారు! మరి పెట్టే ఐడియా ఎవరిదో, తీసేయాలనే నిర్ణయం ఎవరిదో అర్థం కాని పరిస్థితి! ప్రజలకు వరాలు ఇస్తామంటూ జిల్లాలకు వెళుతున్నముఖ్యమంత్రి అక్కడ తీరిగ్గా డ్వాక్రా సంఘాలతో కోట్ల రూపాయలు విరాళాలు తీసుకొని వస్తున్నారు! మరి రుణమాఫీల కోసం వేచి ఉన్న మహిళలు కోట్ల రూపాయల విరాళాలు ఎలా ఇస్తున్నారో అర్థం కావడం లేదు! ఇక ఇవే దారుణాలు అనుకొంటే.. ఏకంగా 40,000 కోట్ల రూపాయల అప్పు చేయడానికి సిద్ధం అయ్యిందట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రుణామాఫీ, డ్వాక్రా రుణమాఫీలు చేయడానికి ప్రభుత్వం ఆస్తులన్నింటినీ కుదవపెట్టాలని, తాము ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రభుత్వ వ్యవస్థను స్తంభించేయాలని తెలుగుదేశం నిర్ణయించింది. ఎన్నికల్లో తమకు అధికారాన్ని సాధించిపెట్టిన రుణమాఫీని అమలు చేయడానికి ఆస్తులన్నింటిపై అప్పు తీసుకురావాలని నిర్ణయించింది. తద్వారా రైతులను రుణ విముక్తులను చేసి, రాష్ట్రాన్ని రుణగ్రస్తురాలిని చేస్తున్నారు. ఈ విధంగా అడుక్కుతినే పద్ధతి, అప్పుల పద్ధతి తప్ప మరో విశేషం కనపడటం లేదు ఇప్పటి వరకూ. ఇక ఇంతకన్నా పరాకాష్ట ఏమిటంటే... ఎర్రచందనం. శేషచలం, నల్లమల అడవుల్లోని ఎర్రచందనాన్ని ప్రభుత్వమే నరికించి దానితో వచ్చే డబ్బుతో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే ప్రయత్నం జరుగుతోందట! మరి ఇలాంటి కబర్లు ఈ శతాబ్దంలో చెప్పాల్సిన మాటలు కావు. అయినా చెబుతున్నారు... తెలుగుదేశం వాళ్లు పబ్బం గడుపుతున్నారు. విరాళాలు, హుండీలు, అప్పులు, ఎర్రచందనం కథలు.. ఇదీ ఇప్పుడు ప్రభుత్వ వ్యవహారం. మరి ఈ పరిస్థితిని చూస్తే.. ఆంధఫ్రదేశ్ ఐకాన్ ఒక ఎవరినైనా బిచ్చగాడిని పెట్టడం మంచిదేమోనని సామాజిక విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరి ప్రభుత్వం ఆదిశగా ఏదైనా నిర్ణయం తీసుకొంటుందా?! దీనికి ఒప్పుకొంటుందా!

మరింత సమాచారం తెలుసుకోండి: