జనానికి మరింత దగ్గరయ్యేందుకు మోడీ ఫైళ్లు కదుపుతున్నారు. సోషల్ సైట్లతో ఇప్పటికే జనానికి చేరువైన మోడీ..తాజాగా పీఎంవో వెబ్ సైట్ కూడా ఓపెన్ చేశారు. ఇప్పుడు ఫ్రీ వైఫై సర్వీస్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. మార్చి నాటికి అర్బన్ ఏరియాలు, యూనివర్శిటీలకు ఫ్రీ వైఫై ఇచ్చేందుకు మాస్టర్ ప్లాన్ రెడీ అవుతోంది. టెక్నాలజీని వీలైనంతగా పిండేసే పీఎం నరేంద్ర మోడీ..జనానికి మరింత దగ్గరయ్యేందుకు స్కెచ్ గీశారు. వైఫైతో కనెక్టింగ్ ద పీపుల్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. పట్టణాలు, యూనివర్శిటీల్లో వైఫై ఫ్రీ సర్వీస్ ఇచ్చేందుకు ఫైళ్లు కదులుతున్నాయి. ఫ్రీ వైఫైపై టెలికాం డిపార్ట్ మెంట్ లో కదలిక వచ్చింది. మార్చి నాటికి ప్రాజెక్టును జనం ముందుకు తెచ్చేందుకు పీఎంవో రెడీ అవుతోంది. అర్బన్ ఏరియాల్లో ఫస్ట్ వైఫై సర్వీస్ అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.  దీనికి తోడు యూనివర్శిటీల్లోనూ వైఫై సదుపాయం కల్పిస్తారు. వైఫై సదుపాయం కల్పించే రాష్ట్రాలకు కూడా కేంద్రం సహయం అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈశాన్య రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ పెడుతోంది కేంద్రం. హిమాలయన్ రాష్ట్రాల్లో మొబైల్ సదుపాయం కల్పించేందుకు స్పెషల్ ప్రొగ్రాం డిజైన్ చేస్తోంది. కొత్తగా ఐదు వందల సెల్ టవర్స్ నిర్మించేందుకు టెలికాం డిపార్ట్ మెంట్ ప్రయత్నాలు చేస్తోంది. కేబినెట్ అప్రూవల్ తో పనులు మొదలు పెట్టేందుకు రెడీగా ఉంది. బీజేపీ ప్రభుత్వం ఈ గవర్నెన్స పై దృష్టి పెట్టింది. ఈ ఏడాది 50 వేల పంచాయతీలను కంప్యూటీకరించనుంది. నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ పరిధిలోకి తీసుకురానుంది. ప్రధానమంత్రి మోడీ ఈ గవర్నెన్స్ పై చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే పీఎంవో వెబ్ సైట్ ఓపెన్ చేసిన మోడీ..తాజాగా ఫ్రీ వైఫైతో జనంలో ఉండేందకు ఫిక్స్ అయ్యారు. టెక్నాలజీని వాడుకోవడం..మోడీకి తెలిసినంతగా మరే నేతకు తెలియకపోవచ్చు. ఎన్నికల ముందు..ఆ తర్వాత ఇంటర్ నెట్ ను ఫుల్లుగా వాడేసుకుంటున్నారు ప్రధానమంత్రి.

మరింత సమాచారం తెలుసుకోండి: