అందరూ అనుకుంటున్నట్టుగా విజయవాడ- గుంటూరు పరిసరాలు రాజధానిగా కాబోవడం లేదా.. రాజధాని కోసం ఇక ఏపీ సర్కారు కొత్త ప్లేస్ వెదుక్కోవలసిందేనా.. ఈ ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఎందుకంటే.. రాజధాని ఎంపిక కోసం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ గుంటూరు పరిసరాలను రాజధానిగా ఎంపిక చేసేందుకు ఏమాత్రం సుముఖంగా లేదట. ఆమేరకు చంద్రబాబుకు ప్రెజంటేషన్ ఇచ్చిందట. అందుకు ప్రధాన కారణం భూముల అధిక ధరలేనంట. చంద్రబాబు సర్కారు భావిస్తున్నట్టు.. విజయవాడ-గుంటూరు-తెనాలి- మంగళగిరి పరిసరాల్లో రాజధాని ఏర్పాటు చేయాంటే.. భూముల కొనుగోలు కోసమే.. రూ.40 వేల కోట్లు కావాలంట. కొత్త రాష్ట్రానికి అంత సొమ్ము వెచ్చించడం అంత మంచిది కాదని శివరామకృష్ణన్ తెగేసి చెప్పారట. దీనికంటే.. ఏదైనా కొత్త ప్రాంతంలో కట్టుకుంటే చాలా సొమ్ము ఆదా అవుతుందని.. సూచించిందట. వాస్తవానికి శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చే సూచనలను పట్టించుకోవాల్సిన అవసరం చంద్రబాబు సర్కారుకు లేకపోయినా.. మంచి సూచనలను పక్కనపెట్టడం కూడా అంత మంచిది కాదు కదా. చంద్రబాబు సర్కారు ఇప్పటిదాకా గుంటూరు ప్రాంతానికి చెబుతున్న ప్లస్ పాయింట్ ఏంటంటే.. అది మొత్తం రాష్ట్రానికి సెంటర్ పాయింట్ గా ఉండటమే. ఐతే శివరామకృష్ణన్ ఇంకో వాల్యుబుల్ పాయింట్ చెప్పారట. రాజధాని అంటే రాష్ట్రానికి మధ్యనే ఉండాల్సిన అవసరం లేదని వివరించారట. అందుకు ఉదాహరణగా చెన్నై. ముంబయి వంటి ఉదాహరణలు చెప్పారు. మరి శివరామకృష్ణన్ సూచనలను చంద్రబాబు వింటారో.. లేకపోతే.. మా రాజధాని మా ఇష్టం అంటూ గుంటూరుకే ఓటేస్తారో.. కాలమే సమాధానం చెబుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: