తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. తెలంగాణ రాజకీయ జేఏసీ అధ్యక్షుడు కోదండరాంల మధ్య విభేదాలు ఉన్నాయా? విబేదాల కారణంగానే కోదండరాంకి ఇంకా ఏ పదవి దక్కలేదా? కోదండరాంకి కెసిఆర్ పాలన నచ్చడం లేదా? అన్నది అందరిలోనూ ఉంది. బయటకు ఊహాగానాలు ఎలా ఉన్నా వారి మధ్య మాత్రం మంచి సంబంధాలే ఉన్నాయని తెరాస వర్గాలు కల్లబొల్లి కబుర్లు చెబుతుంది తప్ప ఆయనకి పదవి ఇవ్వలేదు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ వస్తుందని, కేసీఆర్ దానికి కోదండరాంను అధ్యక్షుడిని చేస్తున్నారని ప్రచారం జరిగినా ఆ ప్రచారం జరిగిన మరుసటిరోజే ఘంటా చక్రపాణి పేరు బయటకు రావడంతో ఆ విషయం అక్కడతో ఆగిపోయింది. ఇక ఆ తర్వాత సాంఘీకసంక్షేమశాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ కు వ్యతిరేకంగా భారీ ఎత్తున ధర్నా జరగడం దానికి కోదండరాం హాజరవడం.. ధర్నా విమర్శలకు దారితీయడం.. కోదండరాం ఇంటిని దళిత సంఘాలు ముట్టడించడం జరిగిపోయింది. ఆ తర్వాత కాంట్రాక్టు ఉద్యోగాలను పర్మినెంట్ విషయంలో విద్యార్థులు కోదండరాంను కలిసి ప్రభుత్వం నిర్ణయం మార్చుకునేలా వత్తిడి తేవాలని డిమాండ్ చేసినా ఆయన మాత్రం కాంట్రాక్టు ఉద్యోగుల వైపే మొగ్గారు. అయితే ఇప్పుడు తాజాగా జరిగిన ఓ పుస్తకం ఆవిష్కరణ సభలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇష్టం వచ్చినట్లు పాలిస్తే కుదరదని.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. అందరినీ దృష్టిలో పెట్టుకొని పరిపాలన సాగించాలని ఓ కామెంట్ విసిరారు. ప్రస్తుతం తెలంగాణ ప్రజలు నిరాశావాదంలోకి వెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన కోదండరాం తెలంగాణ రాష్ట్రం కోసం అన్నివర్గాల వారు ఉద్యమించారని, ఆ ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలని అబిప్రాయపడ్డారు. కోదండరామ్ చేసిన ఈ వ్యాఖలు తెరాస ప్రభుత్వం, కెసిఆర్ పాలన మీద పరోక్షంగా వున్నాయని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే కోదండరాం కెసిఆర్ కి ఓ సూచన చేశాడని అనుకోవచ్చా? లేక హెచ్చరించారని అనుకోవచ్చా? అన్నది అర్ధం కాని పరిస్థితి. ఏది ఏమైనా త్వరలోనే కెసిఆర్ మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత వస్తుందన్నది అక్షరాల నిజం. మరోవైపు తెలంగాణ ఉద్యోగుల మీద పనిభారం పెంచే సూచనలలో ఉన్న కెసిఆర్ కి ఇది ఒకరకంగా హెచ్చరిక చేసినట్లేనని అంటున్నారు!

మరింత సమాచారం తెలుసుకోండి: