కృష్ణా- గుంటూరు జిల్లాల్లో భూములు రిజిస్ర్టేషన్లు జోరందుకున్నాయి. ఆగస్టు ఒకటి నుంచి భూముల మార్కెట్ విలువను పెంపుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండడంతో రిజిస్ర్టేషన్లు ఊపందుకున్నాయి. ఆషాడం ముగియడంతో సోమవారం నుంచే రిజిస్ర్టార్ కార్యాలయాల వద్ద సందడి నెలకొంది.   దీనికితోడు ఆగస్టు నుంచి కృష్ణా- గుంటూరు జిల్లాల్లో భూముల ధరలు అదుపు చేసేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్న ప్రచారంతో లావాదేవీలు జోరుగా సాగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒక్కరోజే రెండేసి వేలకుపైగా రిజిస్ర్టేషన్లు నమోదయ్యాయి. రాత్రి 11 గంటల వరకు రిజిస్ర్టేషన్లు తంతు కొనసాగించడం విశేషం

మరింత సమాచారం తెలుసుకోండి: