ప్రముఖ సినీ నటుడు సాగిరాజు రాజంరాజు కన్ను మూశారు. ఈయనను సినీ రంగంలో ముక్కు రాజుగా పిలుచుకుంటారు.అనేక సినిమాలలో సీరియస్ పాత్రలను పోషించిన ఘనత ఈయనకు దక్కుతుంది.మయూరి సినిమాలో ఆయన చేసిన పాత్రను ఎవరూ మరిచిపోలేరు.వెయ్యి సినిమాలకుపైగా నటించిన ఈయన కొరియాగ్రాఫర్ గా సినిరంగంలో ప్రవేశించారు.ఆర్.నారాయణమూర్తి తీసిన దాదాపు అన్ని సినిమాలలో ముక్కురాజుకు ఒక పాత్ర ఉంటుంది. 1940లో ఒక గ్రామం చిత్రంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు.రాజు స్వస్థలమైన పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడలో శుక్రవారం నాడు ముక్కురాజు అంత్యక్రియలు జరుగుతాయి.రాజు మరణానికి పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: