ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవహారాలు క్రమంగా ఆసక్తిని రేపుతున్నాయి. ఒకవైపు లోకేశ్ బాబు జోక్యం తీవ్రంగా ఉందని... ఆయన ఆఖరికి మంత్రులు సొంతంగా ఓఎస్ డీలను నియమించుకొనే పరిస్థితి లేదని... వార్తలు వస్తున్నాయి. ఇద్దరు ముగ్గురు మంత్రులకు ఇలాంటి అనుభవమే ఎదురైందనే వార్తలు ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. ఈసారి పెద్దబాబు చంద్రబాబు చేతిలో ఒక మంత్రిగారికి చిన్నపాటి పరాభావం ఎదురైందని సమాచారం. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేఈ కృష్ణమూర్తి పంపిన ఫైలును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెనక్కు పంపించారట. భూముల విలువ పెంపుకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి ఫైలును పంపితే.. ఆ ఫైలుకు చంద్రబాబు ఓకే చెప్పలేదట! మొత్తానికి బాబు సీఎంగానే కాకుండా సూపర్ పవర్ గా కూడా వ్యవహరిస్తున్నాడని అనుకోవాల్సి వస్తోంది. ఉప ముఖ్యమంత్రి హోదాలోని వ్యక్తి ఫైలు పంపించినా దాన్ని ఓకే చేయలేదంటే... పరిస్థితి స్పష్టంగా అర్థమవుతోంది! ఏకంగా ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను నియమించుకొంటానని బాబు ఘనంగా ప్రకటించాడు. మరి వారు ఇప్పుడు ఆటలో అరటి పండులేనని అనుకోవాల్సి వస్తోంది. మరి ఇంత త్వరగా ఫైలు వెనక్కు వెళ్లిన సమాచారం బయటకు వచ్చిందంటే.. బాబు ప్రభుత్వపు లోగుట్టులు చాలా ఈజీగా బయటకు వస్తున్నాయని కూడా అర్థమవుతోంది. మరి ఈ వ్యవహారాలు ఇంకా ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో!

మరింత సమాచారం తెలుసుకోండి: