మావోయిస్టు అగ్రనేత కె. రవీందర్ అలియాస్ అర్జున్ తన భార్యతో సహా తెలంగాణ డీజీపీ అనురాగ్‌శర్మ ఎదుట శుక్రవారం లొంగిపోయారు. వీరిద్దరు మావోయిస్టు పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేశారు. గతంలో చత్తీస్‌గఢ్ మావోయిస్టు పార్టీ ఇన్‌చార్జిగా అర్జున్ బాధ్యతలు నిర్వహించారు. దండకారుణ్య స్పెషల్ జోనల్ కమిటీలోనూ, మావోయిస్టు ఫోర్స్ ఇన్‌చార్జిగా కూడా అర్జున్ పనిచేసినట్లు తెలుస్తోంది. అలాగే మావోయిస్టు కేంద్ర కమిటీలోనూ అర్జున్ కీలక బాధ్యతలు నిర్వహించారు. అర్జున్, అతని భార్యపై రూ.25 లక్షల రివార్డును ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు 25 సంవత్సరాలుగా ఆయన మావోయిస్టు పార్టీలో ఉన్నట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో అర్జున్‌ను పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: