వరుణుడు ఆకాశంలో అలా విహరిస్తూ క్రిందికి చూసాడు. అత్యంత ముగ్ధమనోహరమైన పుడమిని చూసాడు. ఆశ్చర్యానికి లోనయ్యి అక్కడే ఆగిపోయాడు. భూమితో ఆ క్షణమే ప్రేమలో పడిపోయాడు. పుడమిని ఎలా అయినా చేరుకుని తన మనసులోని మాటని చెప్పాలనుకున్నాడు. కానీ ఎంత ప్రయత్నించినా భూమిని అందుకోలేకపోయాడు. ఏం చేయాలో తోచక స్థంభించిపోయాడు. ఉరుముల రూపంలో తన బాధను భూమికి వినపడేలా అరిచాడు. భోరున ఏడ్చాడు. అదే మన పాలిట వర్షంగా మారింది. వరుణుని పాలిట శాపంగా మారిన ప్రేమ, వర్షమై మన పాలిట వరంగా మారింది. వరుణుని ప్రేమని అర్ధం చేసుకున్న భూమి ఏం చేయాలో తోచక ఆలోచించింది. అప్పుడు సూర్యుని సాయంతో మేఘంగా మారి వరుణుని చేరింది. అలా ఈ సృష్టిలో అణువణువూ ప్రేమే నిండి ఉంది. స్వరములకందని రాగం ప్రేమ భావాలకందని భాష్యం ప్రేమ వర్ణనకందని భావం ప్రేమ వివరణకందని గొప్ప అనుభవం ప్రేమ కవిత్వానికందని అద్భుతం ప్రేమ ఎంత చదివినా మళ్ళీ చదవాలనిపించే కావ్యం ప్రేమ మన పయనానికి అవసరం ప్రేమ ప్రతి జీవితానికి అంకురం ప్రేమ

మరింత సమాచారం తెలుసుకోండి: