కాలం కలిసిరాకే రాకాసి బల్లులు (డైనోసర్లు) అంతరించిపోయాయా? ఈ భూమీద అవతరించిన తొలితరం జీవరాసిగా భావిస్తున్న ఈ రాకసి బల్లులు గ్రహశకలాలు భూమిని ఢీకొనడం వల్లే ంతరించిపోయాయన్నది పురాతత్వ శాస్తవ్రేత్తల నిర్ధారణ. అయితే ఈ గ్రహశకలం భూమిని ఢీకొనడం కొంచెం ముందుగా గానీ కొంచెం తరువాత గాని జరిగి ఉన్నట్టయితే ఈ జీవజాతులు మూకుమ్మడిగా అంతరించిపోయి ఉండేవికాదని తాజాగా జరిగిన ఓ సర్వే వెల్లడించింది. ఇందుకు సంబంధించి శిలాజ ఆధారాలను విశే్లషించి చరిత్ర పూర్వయుగం నాటి ఈ జీవజాతుల అంతర్ధానానికి దారితీసిన కారణాలను వెలుగులోకి తెచ్చింది. దాదాపు పది కిలోమీటర్ల వెడల్పు కలిగిన ఓ గ్రహశకలం ఢీకొనడానికి కొన్ని మిలియన్ సంవత్సరాల ముందు ఈ భూమీద పర్యావరణ సంబంధింత ఉత్పాతాలు చోటుచేసుకున్నాయి. ఆ సమయంలో అత్యంత తీవ్రస్థాయిలోని అగ్నిపర్వత విస్ఫోటనం జరిగింది. సముద్ర ఉపరితలం పెరిగిపోవడం భరించలేనంత తీవ్రస్థాయిలో ఉష్ణోగ్రత వ్యాపించింది. ఆ సమయంలో రాకాసి బల్లులకు ఆహారం సమస్య ఏర్పడింది. అందుకు కారణం పర్యావరణంలోని వాతావరణంలో విస్తృత మార్పులు రావడమేనని అధ్యయన కర్తలు తెలిపారు. ఆహారం లేక డైనోసర్లు అలమటిస్తున్న సమయంలోనే గ్రహశకలం భూమిని ఢీకొందని దాంతో అవి సమూహికంగా అంతరించిపోయాయని పరిశోధకులు తేల్చారు. గ్రహశకల ప్రభావం వల్ల సునామీలు, భూకంపాలు, పెను మంటలు తలెత్తాయని వీటికి వాతావరణ పరంగా అనేక తీవ్ర మార్పులు తోడయ్యాయని వెల్లడించారు. ఈ పరిస్థితులన్నీ అంతిమంగా ఒకదాని తరువాత ఒకటిగా డైనోసర్ల జాతి అంతరించిపోవడానికి దారితీసిందని తేల్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: