రాష్ట్రంలో సెప్టెంబర్‌ 5వ తేదీ నాటికి పదివేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు మానవవనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. శనివారం జరిగిన బడి పిలుస్తోంది ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ పాఠశాలల్లో ఆడి యో, వీడియో పరికరాలను కూడా ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నా విద్యాభి వృద్ధికి మాత్రం అవసరమైన నిధులు విడుదల చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఆంధ్రరాష్ట్రాన్ని నాలెడ్జ్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో బడి ఈడు పిల్లలందరూ పాఠశాలలకు పంపే బాధ్యతను ఉపాధ్యాయులు, ప్రజలు ఒక ఉద్యమంలా చేపట్టి రాష్ట్రాన్ని నిరక్షరాస్యత లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం 31,286 మంది డ్రాపౌట్స్‌ ఉండగా బడి పిలు స్తోంది కార్యక్రమం ముగిసేనాటికి సుమారు 29వేల మంది పిల్లలు పాఠశాలల్లో చేరారని రాష్ట్రంలో 19.16 శాతంగా డ్రాపౌట్స్‌ ఉన్నారని ఒక్క నెల్లూరులోనే అది 23 శాతంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో బయోమెట్రిక్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర పురపాలకశాఖా మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఉన్నత స్థాయిలో చూసుకోవాలనుకోవడం సహజమేనని, అయితే పిల్లల్ని మొదటి తరగతి నుంచి 8వ తరగతి వరకు వారి విద్యావిధానంపై ప్రత్యేక శ్రద్ధచూపితే వారు ఉన్నత స్థాయిలోకి వెళ్లడం ఖాయమన్నారు.  గతంలో చంద్రబాబునా యుడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు. తాను కోవూరులో ఒక పాఠశాలను దత్తత తీసుకుని ఆ పాఠశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామన్నారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో 2014 సంవత్సరం పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనపరచిన విద్యార్థులకు ఈ సందర్భంగా మంత్రులు జ్ఞాపికలను అందించారు. ఈ సం దర్భంగా జిల్లాలో ఆరు పాఠశాల భవనాలకు శంకు స్థాపనలకు సంబంధించిన శిలాఫలకాలను మం త్రులు ఆవిష్కరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: