దేశంలో కాంగ్రెస్ పార్టీ పేరుతో ఉన్నన్ని పార్టీలు ఏ పార్టీలోనూ ఉండవు.. అందుకే బీజేపీ నేత వెంకయ్యనాయుడు.. ఏ కాంగ్రెస్, బీ కాంగ్రెస్, సీ కాంగ్రెస్ అంటూ ఏ టూ జెడ్ చదివేసి.. పంచ్ డైలాగులిస్తారు. ఇప్పటికే కాంగ్రెస్ పేరుతో ఏపీలో రెండు ప్రముఖ పార్టీలు ఉన్నాయి. వైఎస్సార్ పార్టీలోనూ కాంగ్రెస్ ఉంది కదా.. ఇప్పుడు మరో కొత్త పార్టీ కాంగ్రెస్ పేరు పెట్టుకుని ఊడి పడింది. అదేంటో తెలుసా.. రాయలసీమ కాంగ్రెస్ పార్టీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎక్కువ కాలం ముఖ్యమంత్రులుగా పనిచేసింది రాయలసీమ నేతలే..అయినా.. రాయలసీమ.. వెనుకబడే ఉంది. వాస్తవానికి కొత్త గా ఏర్పడిన తెలంగాణ కంటే కూడా రాయలసీమ అభివృద్ధిలో వెనుకబడే ఉంది. అందుకే రాయలసీమ అభివృద్దే లక్ష్యమంటూ కొత్త పార్టీ పెట్టామంటున్నారు ఆ పార్టీ అధ్యక్షురాలు కె. సుమయ. యువతే తమ లక్ష్యమని.. వారిలో చైతన్యం తెచ్చి సీమను అభివృద్ధి చేస్తామంటూ అజెండా ప్రకటించారు. అంతేకాదు.. వస్తూ వస్తూనే ఈ పార్టీ మరో కొత్త పార్టీ జనసేనపై విమర్శల వర్షం కురిపించింది. జనసేన జెండా రూపకల్పనను తప్పుబట్టింది. జనసేన జెండాలో ఉంటే చక్రాలు హిందూత్వ చిహ్నాలను.. అలాంటి వాటితో జెండా ఎలా రూపొందిస్తారని ఆ పార్టీ నాయకులు ఘాటుగా విమర్శించారు. సీమ అభివృద్ధి కోసం రాజధాని రాయలసీమలోనే ఉండాలని.. విజయవాడ-గుంటూరులను రాజధానిగా ప్రకటిస్తే.. వ్యతిరేకంగా ఉద్యమం లేవదీస్తామని కొత్త కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మరి ఈ కొత్త పార్టీ ఎన్నాళ్లు యాక్టివ్ గా ఉంటుందో.. చూద్దాం..

మరింత సమాచారం తెలుసుకోండి: