నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, ఆయన అనుచరులు నడిరోడ్డుపై చిందులేసిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... నరసాపురంలోని కోర్టు ప్రాంగణం ప్రహరీని ఆనుకుని దుకాణాలను ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. ఈ దృష్ట్యా అక్కడి ఆక్రమణలను తొలగించి ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలని నరసాపురం అదనపు జిల్లా జడ్జి పి.కల్యాణరావు కొన్నిరోజుల కిందట మునిసిపల్ కమిషనర్‌కు, పోలీసులకు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం మునిసిపల్ సిబ్బంది కోర్టు పరిసర ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించారు. ఈ విషయాన్ని ఆక్రమణదారులు ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. తొలగించిన ప్రాంతాల్లోనే తిరిగి బడ్డీలు ఏర్పాటు చేసుకోవాలంటూ వ్యాపారులకు ఎమ్మెల్యే చెప్పారు. దీంతో ఆక్రమణదారులు తిరిగి కోర్డు ప్రహరీ గోడను అనుకుని బడ్డీలు ఏర్పాటు చేసుకున్నారు. శుక్రవారం కోర్టు ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరణ చేసిన న్యాయమూర్తి కల్యాణరావుకు పలువురు న్యాయవాదులు ఈ విషయం చెప్పారు. న్యాయమూర్తి ఆక్రమణదారుల వద్దకు వెళ్లి మీ దుకాణాలను మునిసిపల్ అధికారులు తొలగించారు కదా.. మళ్లీ ఏర్పాటు చేసుకున్నారేమిటని అడిగారు. ఎమ్మెల్యే మాధవనాయుడు పెట్టుకోమన్నారని వారు సమాధానం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనుచరగణంతో అక్కడకు చేరుకుని న్యాయమూర్తిపైన, అక్కడ ఉన్న న్యాయవాదులపైన ఆగ్రహంతో ఊగిపోయారు. దుకాణాలను తొలగించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఎమ్మెల్యే దురుసు ప్రవర్తనతో న్యాయమూర్తి అవాక్కయ్యారు. ఓ దశలో ఎమ్మెల్యే మాధవనాయుడు రూల్స్ ముఖ్యం కాదని, పేదలే ముఖ్యమని, బడ్డీలు తొలగిస్తే సహించేది లేదని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానంటూ ఆగ్రహావేశాలతో ఊగి పోయూరు. న్యాయవాదులు ఎమ్మెల్యేను, అతని అనుచరులను వారించబోగా వారిమధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఘటనపై మనస్తాపం చెందిన న్యాయమూర్తిని సిబ్బంది కోర్టు ఆవరణలోకి తీసుకువెళ్లారు. అనంతరం నిర్వహించిన బార్ అసోసియేషన్ అత్యవసర సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు పోలిశెట్టి బాబ్జి మాట్లాడుతూ ఎమ్మెల్యే మాధవనాయు డు, ఆయన అనుచరులు న్యాయమూర్తిపై విరుచుకుపడటం న్యాయవ్యవస్థపై జరిగిన దాడిగా భావిస్తున్నామన్నారు. న్యాయశాస్త్రంలో పట్టభద్రుడైన ఎమ్మెల్యే మాధవనాయుడు న్యాయమూర్తిపై వ్యవహరించిన తీరు దారుణమన్నారు. ఎమ్మెల్యే తీరును ముఖ్యమం త్రి, హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాధవనాయుడు విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి తనకు న్యాయవ్యవస్థపై అపార గౌరవం ఉందని, న్యాయవ్యవస్థను కించపర్చేవిధంగా వ్యవహరించలేదని అన్నారు. పట్టణంలో తోపుడు బండ్లు, ప్లాట్‌ఫారా లపై బడ్డీలు పెట్టుకుని వ్యాపారం చేసేవారు సుమారు 500మంది ఉన్నారన్నారు. వారి పొట్టకొట్టేవిధంగా వ్యవహరించకూడదని, ఇప్పటికిప్పుడు బడ్డీలు తొల గిస్తే వారంతా ఎక్కడికి వెళతారని ప్రశ్నించారు. న్యాయవాదులు తనతో దురుసుగా వ్యవహరించారని, ఆ ప్రా ంతంలో న్యాయమూర్తి ఉన్నట్టు తనకు తెలియదని అన్నారు. న్యాయమూర్తి రోడ్డుపైకి వచ్చి బడ్డీలు తొలగి స్తారని ఊహించలేదన్నారు. ఇదంతా కొందరు న్యాయ వాదులు కుట్రతో చేయిస్తున్న పని అని మండిపడ్డారు. పంప్ ఆపరేటర్లపై నోరు పారేసుకున్న ఎమ్మెల్యే మొగల్తూరు : నరసాపురంలో నడిరోడ్డుపై వీరంగం చేసిన ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు మెుగల్తూరు మండలం కేపీ పాలెంలో పంపు ఆపరేటర్లపైనా విరుచుకుపడ్డారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన చిరుద్యోగులపై నోరు పారేసుకున్నారు. శుక్రవారం కేపీపాలెంలోని మంచినీటి చెరువును పరిశీలించేందుకు వచ్చిన ఎమ్మెల్యే మాధవనాయుడుకు అక్కడి మంచినీటి ప్రాజెక్టులో పనిచేస్తున్న పంప్ ఆపరేటర్లు తమ సమస్యలు విన్నవించుకున్నారు. ఎటువంటి కారణం చెప్పకుండా తమను విధుల్లోంచి తొలగించారని, అధికారులను అడిగితే ఎమ్మెల్యే తొలగించమన్నారని చెబుతున్నారని పంప్ ఆపరేటర్లు మెురపెట్టుకున్నారు. దీంతో ఎమ్మెల్యే స్పందిస్తూ ‘నియోజకవర్గంలోని ఏ మంచినీటి ప్రాజెక్టు నుంచి ఆరోపణలు లేవు. మీరు సరిగా పనిచేయడం లేదని, సమాధానం సరిగ్గా చెప్పడం లేదని గ్రామస్తులు నాకు ఫిర్యాదు చేశారు’ అంటూ ఎమ్మెల్యే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో ఎమ్మెల్యే అనుచరులు కలుగజేసుకుని ఆపరేటర్లతో వాగ్వివాదానికి దిగారు. ఈ దశలో దీంతో ఎమ్మెల్యే మాధవనాయుడు ఆవేశంతో ఊగిపోతూ ఆపరేటర్లపై చిందులు తొక్కారు. ఎమ్మెల్యే అనుచరులు సైతం ఆపరేటర్లపై విరుచుకుపడ్డారు. బండారు మాధవనాయుడు, పి.కల్యాణరావు, జాతీయ జెండా, ఎమ్మెల్యే, bandaru madhava rayudu, p.kalyana rao, National flag, MLA

మరింత సమాచారం తెలుసుకోండి: