మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురించి ఒక ఆసక్తికరమైన వార్త ప్రచారంలోకి వచ్చింది. కిరణ్ వాళ్ల తమ్ముడు కొడుకుకి ఎంబీబీఎస్ లో సీటు దక్కడం గురించిన వార్త ఇది. మరి ఎంబీబీఎస్ లో సీటు దక్కడం ఏం వార్త అంటారా.. అది తెలుగుదేశం నేతకు చెందిన కాలేజీలోనో అనేది ఆసక్తికరమైన అంశం. అది పేమెంట్ సీటుకావడం మరింత ఆసక్తికరం, ఉచితంగా ఇచ్చారనడం మరింత ఆసక్తికరం! ఇప్పుడు మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ పేమెంట్ సీటుకు ఎంత విలువ ఉందో ప్రత్యేకంగా చెప్పనసరం లేదు. డబ్బున్న వాళ్లు తమ పిల్లలను ఎంబీబీఎస్ చదివించడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి కూడా పెద్దగా వెనుకాడటం లేదు. ఇటువంటి నేపథ్యంలో కిరణ్ వాళ్లింటి అబ్బాయికి ఒక తెలుగుదేశం నేతకు చెందిన మెడికల్ కాలేజీలో ఉచితంగా సీటును ఇచ్చారట. పేమెంట్ అవసరం లేకుండా ఈ డీలింగ్ జరిగిందట. మరి కిరణ్ మీద గౌరవంతోనే ఉచితంగా సీటు ఇచ్చారో.. లేక కిరణ్ తో ఆ తెలుగుదేశం నేతకు ఏమైనా ఆర్థిక సంబంధాలే ఉన్నాయో అర్థం కావడం లేదు. ఆ తెలుగుదేశం నేత మరెవరో కాదు.. అధ్యక్షుడు చంద్రబాబుకు బాగా సన్నిహితమైన వ్యక్తి. రాజ్యసభ సభ్యుడు. తెలుగుదేశం వ్యవహారాలపై ప్రభావం చూపగల వ్యాపారవేత్త అతడు. మరి అలాంటి వ్యక్తి కాలేజీలో.. ఒకనాటి కాంగ్రెస్ వాది , సమైక్యవాదిగా వేరే పార్టీ పెట్టుకొని.. తెలుగుదేశాన్ని తీవ్రంగా విమర్శించిన నేత వాళ్ల అబ్బాయికి ఉచితంగా మెడికల్ సీటు దక్కడం ఆసక్తికరమైన పరిణామమే. మరి వాళ్ల అసలు డీల్ ఏమిటో మరి!

మరింత సమాచారం తెలుసుకోండి: