రాజధాని విషయంలో రాయలసీమ వాసుల్లో ఇప్పుడే అగ్గిరాజుకుంటోంది. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం.. రాజధాని తమ ప్రాంతానికే ఇవ్వాలని సీమవాసులు కోరుకుంటున్నారు. రాజధాని తమ న్యాయమైన డిమాండ్ అని వారు భావిస్తున్నారు. ఐతే.. రాష్ట్రం విడిపోయే ముందు కానీ.. విడిపోయిన తర్వాత కానీ.. ఈ డిమాండ్ ను రాయలసీమ నేతలు కానీ.. కర్నూలు నాయకులు గానీ పెద్దగా వినిపించలేకపోయారు. ఆల్రెడీ ఇప్పుడు విజయవాడ-గుంటూరు ప్రాంతాన్ని రాజధానిగా దాదాపుగా ప్రకటించేశాక ఇప్పుడు మేలుకుని హడావిడి చేస్తున్నారు. రాష్ట్ర విభజన కష్టాలపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు.. రాజధాని అంశంపై సుదీర్ఘంగానే వివరణ ఇచ్చారు. కొత్త రాజధాని విషయంపై అందరినీ మెంటల్ గా ప్రిపేర్ చేసేలా మాట్లాడారు. తాను కూడా రాయలసీమ వాసినేనని.. కావాలంటే మా తిరుపతి దగ్గర్లోనే పెట్టుకునే వాడిని అంటూ ఆలోచింపచేసేలా మాట్లాడారు. రాజధాని వంటి కీలక విషయాల్లో స్వార్థం ఉండకూడదని.. న్యాయం వైపే అడుగులు వేయాలని అన్నారు. రాజధాని ఎక్కడో చెప్పకుండానే విభజన చేయడం ద్వారా ఏపీ జనం కొట్టుకునేలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిందని విమర్శించారు చంద్రబాబు. కర్నూలును రాజధాని చేయకపోతే ప్రత్యేక సీమ రాష్ట్రం ఇవ్వాలంటున్నారన్న ప్రశ్నకు చంద్రబాబు స్పందించారు. అలా అయితే జిల్లాకో రాష్ట్రం ఏర్పాటు చేయాలి కదా అంటూ కౌంటర్ ఇచ్చారు. కర్నూలుకు ప్రస్తుతం తాను ఇస్తున్న ప్యాకేజీని గతంలో ఎవ్వరూ ఇవ్వలేదంటూ చంద్రబాబు వివరించారు. అభివృద్ధి కావాలో... రాజకీయాలు కావాలో తేల్చుకోవాలంటూ ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఇప్పుడు రాజకీయాలు మాట్లాడు తున్న నేతలు ఇన్నేళ్లుగా కర్నూలు కోసం ఏంచేశారో చెప్పండంటూ నిలదీశారు. కర్నూలులో 30వేల ఎకరాలలో పారిశ్రా మిక సిటీని అభివృద్ధి చేస్తానని... ప్రత్యేకంగా ఎయిర్‌పోర్టును ఏర్పాటు చేస్తానని... పారిశ్రామికంగా కర్నూలును అగ్రగామిగా నిలబెడతానని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: