వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ తెలుగుదేశం పార్టీకి బిగ్ ఆఫర్ ఇచ్చారు న వద్ద లక్ష కోట్లు ఉన్నాయని టీడీపీ నేతలు పదేపదే ఆరోపిస్తున్నారని తన దగ్గర అంత డబ్బు ఉంటే. పది శాతం తనకు ఇచ్చి మిగతాది టీడీపీ నేతలు తీసుకోవచ్చునన్నారు. బడ్జెట్‌లో రుణమాఫీకి లక్ష కోట్లు కేటాయించాలని వైయస్ జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రుణమాఫీకి లక్ష కోట్లు కేటాయించకపోతే ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. సభలో జగన్ ఓసారి సభ వాయిదా పడి తిరిగి ప్రారంభమైనప్పుడు జగన్ మాట్లాడారు. మూడు నెలల్లో 10 మంది వైసిపి పార్టీ కార్యకర్తలను కిరాతకంగా చంపేశారని ఆరోపించారు. ఈ విషయంలో ఏ చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని అడిగితే తమకు సమాధానం ఏమీ లభించలేదన్నారు. హత్యకు గురైన వ్యక్తుల కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనలతో బతుకుతున్నారన్నారు. మూడేళ్లలో పాలన మొత్తం విజయవాడ నుంచే సాగుతుందన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: