భారతీయ జనతా పార్టీపై తన పెద్దరికాన్ని నిలబెట్టుకునేందుకు రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు (ఆర్‌ఎస్‌ఎస్‌) ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించిన కొత్త కార్యవర్గం దీనిని ధ్రువీకరిస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్ లో పనిచేసే వాళ్ళు అత్యంత క్రమశిక్షణతో కూడిన సైనికభావాలతో ఉంటారన్న విషయం తెలిసిందే. అమిత్ షా ప్రకటించిన కొత్త టీమ్ లో ఆర్‌ఎస్‌ఎస్‌ నేపథ్యం ఉన్నవాళ్ళే ఎక్కువగా ఉన్నారు. దాదాపు 14 మంది ఉపాధ్యక్షుల్లో 11 మంది ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధం ఉన్నవారే. ప్రధాన కార్యదర్శుల్లో కూడా ఎక్కువమందికి సంఫ్‌ుతో కీలక సంబంధాలు ఉన్నాయి.  సాధారణంగా ఇప్పటివరకు పార్టీకి, సంఫ్‌ుకు మధ్య సమన్వయంకోసం అటూ ఇటూ కొందరిని నియమించి పనిచేయించడం సాధారణం. ఇప్పుడు కార్యవర్గంలో సంఫ్‌ుకు చెందినవారిని ఎక్కువమందిని తీసుకోవడం పార్టీపై పట్టుకు ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. యువతకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉద్దేశ్యంతోనే కొత్త టీమ్ ను తీసుకోవడం జరిగిందని పార్టీ ప్రధాన నాయకుడు ఒకరు చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌ పెత్తనం ఉందా అన్న విషయాన్ని ఆయన దాటవేయడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: