ప్రతీకార రాజకీయాల చరిత్ర మనకు లేదు... అని తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పార్టీ ఎమ్మెల్యేలతో చెప్పారట. అయినా అపోజిషన్ వాళ్లు జరుగుతున్న హత్యల గురించి జనాల మధ్య కు వెళ్తున్నారు. మన పార్టీకి చెడ్డపేరు తీసుకు వస్తున్నారు. మీరు జాగ్రత్తగా ఉండాలి.. వారి ఆరోపణలను తిప్పకొట్టాలి... అంటూ బాబు దిశానిర్దేశం చేశారట. మరి అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు లేవనెత్తిన హత్యారాజకీయాల అంశం హైలెట్ అయినట్టేనని చెప్పుకోవాలి. తెలుగుదేశం వాళ్లు కూడా అధికారం చేతికి అందాకా బాగానే తమ దర్భార్ నడుపుతున్నారు. ఆంధ్ర ఏరియాలో కొంతమంది వైకాపా కార్యకర్తల హత్యలు జరిగాయి. ఇక సీమలో చీనీ చెట్ల నరికివేత ప్రోగ్రామ్ లు జరిగాయి. అలాగే ఎంపీటీసీ, జడ్పీటీసీ చైర్మన్ ఎన్నికల సందర్భంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులను బెదిరించడం, వారిని కిడ్నాపులు చేయడం వంటివి జరిగాయి. అ అంశాలను ఆధారంగా చేసుకొని వైకాపా వాళ్లు అసెంబ్లీలో రెచ్చిపోయారు. రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలకు తెలుగుదేశం వాళ్లు గట్టిగా సమాధానం చెప్పడానికి ప్రయత్నించారు. తమ పార్టీకి అలాంటి ఇమేజ్ లేదని తమకు తామే సర్టిఫికెట్ ఇచ్చుకొన్నారు. పదేళ్ల కిందట జరిగిన పరిటాల హత్య గురించి కూడా ప్రస్తావించారు. అయితే ఇక్కడే తెలుగుదేశం వీక్ అయ్యింది. పరిటాల హత్య పై సీబీఐ విచారణ కూడా జరిగిందని, జగన్ మోహన్ రెడ్డిని నిర్దోషిగా తేల్చారని వైకాపా వాళ్లు గుర్తు చేశారు. అంతేగాక పరిటాల హత్య కేసులో దోషిగా తెలుగుదేశం ఒకప్పుడు ఆరోపించిన దివాకర్ రెడ్డిని ఇప్పుడుఆ పార్టీలోనే చేర్చుకొన్నారని.. తెలుగుదేశం తరపున ఆయన ఎంపీగా ఉన్నాడనే విషయాలను గుర్తు చేశారు. మరి ఈ విషయంలో తెలుగుదేశం వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఈ వ్యవహారంపై మంత్రి రావెల కిశోర్ బాబు అయితే.. రాయలసీమ గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. హత్యారాజకీయాలు రాయలసీమలోనే జరుగుతాయని ఆయన అని కొత్త వివాదాన్ని రాజేశాడు. ఈ విధంగా అసెంబ్లీలో చర్చ సందర్భంగా తెలుగుదేశం వ్యూహం కొంత వరకూ మిస్ ఫైర్ అయ్యింది

మరింత సమాచారం తెలుసుకోండి: