ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ తాత్కలిక రాజధాని మాత్రమేనని కేఈ స్పష్టం చేశారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో కేవలం 500 ఎకరాల ప్రభుత్వ భూమి మాత్రమే ఉందని... అలాంటి చోట శాశ్వత రాజధాని ఎందుకు ఏర్పాటు చేస్తానంటున్నారో తనకు అర్థం కావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. రాజధానిపై మంత్రి నారాయణ చూపిస్తోన్న అత్యుత్సాహం వల్లే ఇదంతా జరిగందని ఆయన విమర్శించారు. విజయవాడను శాశ్వత రాజధానిగా చేయాలని ఇంకా తాము నిర్ణయించలేదని అన్నారు. రాజధానికి సరిపడా ప్రభుత్వ భూమి కేవలం కర్నూలు నగరంలోనే ఉందని ఆయన స్పష్టం చేశారు. కర్నూలు చుట్టూ 10 కిలోమీటర్ల రేడియస్ లో 5 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని తెలిపారు. అలాగే కర్నూలు జిల్లా మొత్తంలో 32 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని కేఈ వ్యాఖ్యానించారు. విజయవాడ ఏపీకి రాజధాని అంటూ రోజుకో స్టేట్ మెంట్ ఇస్తున్న నాయకుల తీరు తనకు బాధ కలిగిస్తోందన్నారు. కర్నూలును రాజధాని చేయాలని తాను అనడం లేదని... చంద్రబాబు కర్నూలుకు ఇచ్చిన హామీలలో సగం నెరవేర్చినా... తాను చరిత్రలో నిలిచిపోతానని కేఈ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: