ఆరోగ్య శ్రీ పేరు ను అధికారికంగా మార్చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వ హయాంలో ప్రారంభం అయిన ఈ పథకానికి తెలుగుదేశం వాళ్లు పసుపు రంగు వేసేశారు. ఎన్టీఆర్ పేరును చేర్చేశారు. మరి ఎవరి ఆలోచనకో... ఎవరో ప్రారంభించిన పథకానికి తెలుగుదేశం వాళ్లు ఇలా ఆర్టిఫిషియల్ గా పేరు జోడించినంతమాత్రాన దానిపై వారి ముద్ర పడిపోతుందా? అనేది ఆలోచించాల్సిన విషయమే! వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే ఎంత నచ్చని వాళ్లు అయినా... కాదనలేని ఆయన గొప్ప ఆలోచనా విధానానికి నిదర్శనం "ఆరోగ్య శ్రీ''. వైఎస్ పోయినా.. ఆయన మార్కును చెరిపేయడానికి అనేకమంది ప్రయత్నించిని.. రాష్ట్రమే ముక్కలు అయినా... ఆరోగ్యశ్రీని మాత్రం రద్దు చేస్తున్నాం... అనే ప్రకటన ఎవరూ చేయలేకపోతున్నారు. ఈ పథకాన్ని ఇకపై సరిగాఅమలు పరుస్తారా... పేదవాళ్లకు కార్పొరేట్ వైద్యాన్ని దగ్గర చేసిన దీన్ని భ్రష్టు పట్టించకమానతారా? అనేది వేరే సమస్య అయినా.. దీన్ని అధికారికంగా రద్దు చేసేంత సాహసం చేయడం లేదంటే ఈ పథకం ఎంత పవర్ ఫుల్లో అర్థం అవుతోంది. అయితే వెనుకటికి తెలుగుదేశం పార్టీ వాళ్లు, తెలుగుదేశం అభిమానులు ఆరోగ్యశ్రీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేవాళ్లు. ఈ పథకం కార్పొరేట్ హాస్పిటల్స్ కు వరప్రదంగా మారిందని.. ఇలా కాకుండా మరో రకంగా అమలు చేయాలని... చెప్పుకొచ్చేవాళ్లు. అయితే అలాంటి వాళ్లలో కూడా చాలా మంది ఈ పథకం వల్ల పరోక్షంగా, ప్రత్యక్షంగా లబ్ధి పొందిన వాళ్లున్నారనేది సత్యం. మరి అన్ని కబుర్లు చెప్పినా.. ఆరోగ్యశ్రీని యథాతథంగా అమలు చేస్తూ.. దానికి ఎన్టీఆర్ పేరును జోడించి.. రాజకీయ లబ్ధి పొందుదామని తెలుగుదేశం భావిస్తోంది. ఒకవేళ టీడీపీ వాళ్లు పాత పేరుతోనే ఆరోగ్యశ్రీని కొనసాగించి ఉంటే.. అది హుందాతనం అయ్యేది. తెలుగుదేశం పార్టీకి అనేక విధాలుగా మార్గదర్శకుడు అయిన మోడీ నేమో కాంగ్రెస్ ప్రారంభించిన ఏ పథకానికీ పేరు మార్చమని అంటున్నారు. తెలుగుదేశం వాళ్లేమో వైఎస్ మానసపుత్రికకు కూడా ఎన్టీఆర్ ట్యాగ్ తగిలించారు. మరి ఇది దత్తతకళే అవుతుంది.. ఆరోగ్య శ్రీ కళ వైఎస్ కే సొంతం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: