నరసారావపు పేట ఎంపీ రాయపాటి సాంబశివరావు చాలా నిరుత్సాహంగా ఉన్నాడట. ఈ నిరుత్సాహాన్ని ఆయన బహిరంగంగానే వ్యక్తపరుస్తున్నాడట. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా పెద్దగా ఉపయోగడం కనపడటం లేదని.. అధికార పార్టీ నేత అయినప్పటికీ తనకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దేన్నైనా బయటకు మాట్లాడేసి పార్టీని ఇబ్బంది పెట్టే తత్వం ఉన్న రాయపాటి తెలుగుదేశంలో కూడా అదే తీరును కొనసాగిస్తున్నాడు. కాంగ్రెస్ పని అయిపోయిందని భావించి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసి టీడీపీలో చేరిన వారిలో ఒకరు రాయపాటి సాంబశివరావు. అధికారంలో ఉన్న పార్టీ నుంచి అధికారాన్ని సొంతం చేసుకొన్న పార్టీలోకి జంప్ చేసిన అదృష్టవంతుడీయన. ఇటువంటి నేపథ్యంలో రాయపాటికి కొన్ని తన కోరికలు నెరవేర్చుకోవాలని భావిస్తున్నాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచే రాయపాటికి టీటీడీ చైర్మన్ పదవి మీద ఆశలున్నాయి. అయితే అవి అక్కడ నెరవేరలేదు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం లోకి తాను వచ్చి, తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన సమయంలోనైనా ఆ ఆశలు నెరవేరతాయని రాయపాటి అనుకొంటున్నాడు అయితే అవి నెరవేరేలా కనపడటం లేదు. ఇక నియోజకవర్గ స్థాయిలో , ఇతర వ్యవహారాల్లో కూడా రాయపాటికి చాలా అసంతృప్తి ఉందట. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పనులు జరిగినట్టుగా ఇప్పుడు జరగడం లేదని ఆయన అంటున్నాడు. మరి కాంగ్రెస్ నుంచి ఇలా టీడీపీలోకి వచ్చిన నేతలు ఇదంతా.. బోనస్ అనే విషయంలో రియలైజ్ కావాలి. ఎంపీ హోదా అనేదే తమకు లభించిన అదనపు హోదా అనుకోవాలి. అంతేగానీ.. గతంలా ఇప్పుడు చక్రం తిప్పలేకపోతున్నాం అనుకొంటే.. నిరాశ తప్ప ఏమీ మిగలదు!

మరింత సమాచారం తెలుసుకోండి: