తెలంగాణ భారతీయ జనతా పార్టీ నేతలు, తెలుగుదేశం నేతలు మళ్లీ కలుస్తున్నారు.గత కొంతకాలంగా బిజెపి నేతలు సొంతంగా వివిధ కార్యక్రమాలు చేపడుతూ, టిడిపితో సంబంధం లేనట్లుగా వ్యవహరించారు.మెదక్ ఉప ఎన్నిక నేపధ్యంలో కాంగ్రెస్,టిఆర్ఎస్ లు పోటీకి దిగుతున్న తరుణఃలో ఉప ఎన్నికలో కలిసి పనిచేయడానికి వీలుగా ఈ రెండు పార్టీల నాయకులు కలిశారు. ప్రధానంగా బిజెపి జాతీయ అద్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ వచ్చి వెళ్లాక ఈ పరిణామం సంభవించడం గమనర్హం. షా స్వయంగా చంద్రబాబును కలిసివెళ్లారు.ఈ నేపధ్యంలో బిజెపి తెలంగాణ శాఖ అద్యక్షుడు కిషన్ రెడ్డి ,శాసనసభ పక్ష నేత డాక్టర్ లక్ష్మణ్ లు టిదిపి నేత ఎర్రబెల్లి దయాకరరావు ఇంటిలో సమావేశం అయ్యారు.మెదక్ ఉప ఎన్నిక,అభ్యర్ధి గురించి చర్చించారు.బిజెపి పోటీచేయకపోతే, తాము పోటీచేస్తామని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు.దీంతో బిజెపి నేతలు స్వయంగా రంగంలో దిగారు. గత ఎన్నికలలో బిజెపినే ఇక్కడ పోటీచేసింది. తెలంగాణ టిడిపి ఉప నేత రేవంత్ రెడ్డి కూడా ఈ చర్చలలో పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: