ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాలను ఈ వారం ఉష్ణోగ్రతలు కాకపుట్టిస్తూనే ఉన్నాయి. ఉత్తర భారత్‌లో వర్షాలు కురియకపోవచ్చని భారత వాతావరణ శాఖ (ఐఎండి) భావిస్తోంది. కానీ, ఈశాన్య, ఉప-హిమాలయాల ప్రాంతాలు, పశ్చిమతీరం, దక్షిణ ద్వీపకల్పంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ వారంలో వాయవ్య భారతదేశంలో వర్షాలు నిరవధికంగా కొనసాగనుంది. 'ఈశాన్య భారతదేశం, ఉప హిమాలయ పశ్చిమబెంగాల్‌ ప్రాంతంలోని అనేక ప్రదేశాలలో ఈ వారం భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి. పశ్చిమ తీరం, దక్షిణ ద్వీపకల్పంలో ఆగస్టు 26వరకూ భారీ వర్షాలు, ఓ మెస్తరు వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉంది' అని ఐఎండి తెలిపింది. వర్షాలు ఆలస్యంగా కురవడం వల్ల మైదాన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తీవ్రతరం అయ్యే పరిస్థితులు ఉన్నాయి. అదే సమయంలో, మహారాష్ట్ర, గుజరాత్‌లో వర్షాలు ఎక్కువగా కురవకపోవచ్చు. వరదలు ఉన్న తూర్పు ఉత్తరప్రదేశ్‌లో వర్షాలు పెరుగుతాయి. వర్షపాతం వాయవ్య భారత్‌లో దాదాపు కురవకపోవచ్చు. అయితే, ఉష్ణోగ్రతలు తీవ్రం కానున్నాయి. పశ్చిమ తీరం, మహారాష్ట్రలోని కొన్ని భాగాలు, గుజరాత్‌, విదర్భ ఈసారి అదనపు వర్షాల తీవ్రత బాగా తగ్గుతుంది. కాగా, ఐఎండి ప్రకారం దేశవ్యాప్తంగా సాధా రణంగా కురవాల్సిన వర్షపాతం అంచనా 630.4మి.మీటర్లకు గాను 516మి.మీ.ల వర్షపాతం మాత్రమే నమోదైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: