విజయసాయిరెడ్డి.. ఈ ఆడిటింగ్ రంగ మాంత్రికుడు జగన్ కుడిభజమన్న సంగతి తెలిసిందే.. జగన్ కు ఏ ఏ కంపెనీల్లో ఎన్నెన్ని వాటాలున్నాయో.. ఆయనకైనా తెలియదేమో కానీ విజయసాయికి తెలియకుండా ఉండదు. జగన్ వ్యాపార సామ్రాజ్యానికి ఆర్థిక మంత్రిగా చెప్పుకోవచ్చు. వైఎస్ హయాంలో ఆయన అధికారాన్నిఅడ్డుపెట్టుకుని వచ్చిన ముడుపులను.. తెలివిగా వివిధ కంపెనీలను పుట్టించి.. వాటిలో పెట్టుబడులుగా మలచి.. ఎక్కడా చట్టానికి చిక్కకుండా రూపొందించిన ఆర్థిక సామ్రాజ్యానికి విజయసాయిరెడ్డే సృష్టికర్తగా చెప్పుకుంటారు. అందుకే సీబీఐ ఎన్ని కోణాల్లో దర్యాప్తు చేసినా.. చెప్పుకోదగ్గ ఫలితం కనిపించలేదేమో. విజయసాయిరెడ్డికి జగన్ దగ్గరున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. మరి ఎవరెవరికో టికెట్లిచ్చిన ఎంపీలను, ఎమ్మెల్యేలను చేసిన జగన్.. విజయసాయిని అధికారానికి దూరంగా ఉంచుతారా.. గతంలో వైఎస్ హయాంలో విజయసాయిరెడ్డి టీటీడీ పాలక వర్గంలో సభ్యుడి పనిచేశారు. వాస్తవానికి విజయసాయి గత ఎన్నికల బరిలోనే రంగంలోకి దిగాలనుకున్నారట. నెల్లూరు నుంచి ఎక్కడో ఓ చోట పోటీ చేసేందుకు రెడీ అయ్యారట. కానీ సమీకరణాలు కుదరక.. చివరి నిమిషంలో డ్రాప్ అయ్యారు విజయసాయి. ఆ సమయంలో నే జగన్ విజయసాయికి రాజ్యసభ సీటు హామీ ఇచ్చారట. మరి విజయసాయిని రాజ్యసభకు పంపాలంటే ముందుగా ఏదో ఒక పార్టీ పదవి కట్టబెట్టాలి. లేకపోతే.. ఇంటా బయటా విమర్శలు ఖాయం. అందుకే తాజాగా వైకాపా ప్రకటించిన పార్టీ ప్రధానకార్యదర్శుల నియామకం సమయంలో విజయసాయికీ చోటు కల్పించాడు జగన్. కొన్నాళ్లు ఈ పదవిలో పనిచేశాక రాజ్యసభ సీటు ఇచ్చినా పెద్దగా విమర్శలు రావన్నది జగన్ యోచనగా కనిపిస్తోంది. మరోవైపు.. పార్టీ ప్రదాన కార్యదర్శుల నియామకంలోనూ.. జగన్ పాత అనుబంధాలకే పెద్దపీట వేసినట్టు కనిపిస్తోంది. సుజయ్ కృష్ణ రంగారావు, ధర్మాన ప్రసాదరావు, మోపిదేవి వెంకటరమణ, జంగా కృష్ణమూర్తి, ఎంవీ మైసూరారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, పీఎన్వీ ప్రసాద్, విజయసాయిరెడ్డిలకు ఈ పదవులు కట్టబెట్టారు. ఇందులో ధర్మాన, మోపిదేవి, విజయసాయి ముగ్గూరు జగన్ కేసుల్లో ఇరుకున్నవారే.

మరింత సమాచారం తెలుసుకోండి: