మాఫీ పేరుతో రైతులు, మహిళల ఓట్లు కొల్లగొట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు రోజుకో ప్రకటనతో వారిని అయోమయంలో పడేస్తున్నారు. ప్రభుత్వం ఓ వైపు రుణమాఫీ అని ఉత్తర్వులు జారీ చేస్తుండగా, మరోవైపు బ్యాంకులు నగల వేలం నోటీసులు ఇస్తుండడంతో రైతులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. చంద్రబాబూ..ఇదేం మాయని ప్రశ్నిస్తున్నారు. మనుబోలు మండలానికి చెందిన 134 మంది రైతులు స్థానిక ఎస్‌బీఐ శాఖలో 2011 డిసెంబర్‌లో నగలు తాకట్టు పెట్టి రూ.95.31 లక్షలు రుణంగా తీసుకున్నా రు. సేద్యం సరిగ్గా సాగక అప్పు తిరిగి చెల్లించలేకపోయారు. ప్రస్తుతం అ ప్పు వడ్డీతో కలిపి రూ.1.19 కోట్లు అయింది. ఈ క్రమంలో రుణమాఫీ చేస్తామంటూ చంద్రబాబు ప్రకటించడంతో తమ అప్పులు తీరిపోతాయని సం తోషించారు. రైతులకు రూ.1.5 లక్ష, పొదుపు సంఘాలకు రూ.లక్ష మాఫీ చేస్తామని ఈ నెల 14న ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంతో రుణాలు మాఫీ అయినట్టేనని భావించారు. అయితే బంగారు నగలను తాకట్టు పెట్టి తీసుకు న్న రుణాల విషయాలను ఈ ఉత్తర్వులను బ్యాంకర్లు అమలు చేయడం లే దు. నగలతో పాటు పాసుపుస్తకాలను సమర్పించి తీసుకున్న రుణాలు కూడా మాఫీ కావని, వడ్డీతో సహా చెల్లించాలని రైతులకు నోటీసులు ఇస్తున్నారు. వెంటనే నగదు చెల్లించని పక్షంలో ఈ నెల 26వ తేదీన బంగారు నగలను వేలం వేస్తామంటూ ఇప్పటికే రైతులకు నోటీసులు ఇచ్చారు. రుణం మాఫీ అవుతుందని ఓ వైపు, రుణం చెల్లించకపోతే నగలు వేలం వేస్తారనే ఆందోళనతో మరోవైపు ది క్కుతోచని స్థితిలో రైతులు కొ ట్టుమిట్టాడుతున్నారు. పొ దుపు మహిళలు కూడా రుణమాఫీ విషయంలో అయోమ య పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రతి ఒక్కరూ లక్ష మాఫీ అవుతుందని భావించి తమ వద్దకు వస్తున్నారని, అయితే 2013 డిసెంబర్ 31కు ముందు తీసుకున్న రుణాలకే మాఫీ వర్తిస్తుందని బ్యాంకు అధికారి ఒకరు తెలి పారు. అది కూడా పొదుపు సంఘం ఖాతాలో మూలధనంగా జమ చేస్తామని మాత్రమే జీఓలో ఉందని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: