చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రులు అంటే వాళ్లు అవతలి వారిని ముప్పుతిప్పలు పెట్టగలిగే సత్తా ఉన్నవాళ్లు.. ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టగలిగే సత్తా ఉన్నవాళ్లు... అని అనుకొంటాం కానీ.. వాస్తవంలో మాత్రం ఒక్కోసారి ఈ అభిప్రాయం బుడగలా తేలిపోతోంది. ఏపీ మంత్రులు అసెంబ్లీలో చేస్తున్న ప్రసంగాలతో ఒక్కోసారి అభాసుపాలవుతున్నారు. నవ్వులు పూయిస్తున్నారు. మరి పొరపాటునో... గ్రహపాటునో వారు నోరు జారి నవ్వులు పండిస్తున్నారు. మరి మనిషి అన్నాకా పొరపాటుగా మాట్లాడటం సహజమే అయితే... ఏపీ మంత్రులు చంద్రబాబును కీర్తించడం విషయంలో నోరు జారుతున్నారు. బాబును పొగడటం విషయంలో వారు తమను తాము మరిచిపోయి మాట్లాడుతున్నారు. అది కూడా అసెంబ్లీ సాక్షిగా.. దీంతో నవ్వులే నవ్వులు! ప్రస్తుతం క్రీడాశాఖ మంత్రి బాధ్యతల్లో ఉన్న అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ఏదో విషయం గురించి మాట్లాడుతూ... 2002లో చంద్రబాబు నాయుడి ఆధ్వర్యంలో ఒలింపిక్స్ ను నిర్వహించామని చెప్పుకొచ్చారు! తమ ప్రభుత్వం అద్భుతాలు సృష్టిస్తుందని.. ఒలింపిక్స్ ను కూడా నిర్వహించేసిందని ఆయన బాబుగారికి బ్రహ్మరథం పట్టారు! మరి ఇండియాలో ఎప్పుడు ఒలింపిక్స్ జరిగాయి? అది కూడా బాబు గారి ఆధ్వర్యంలో ఎప్పుడు జరిగాయి? అంటే... జరిగింది ఒలింపిక్స్ కాదు! జాతీయ క్రీడలు! 2002లో హైదరాబాద్ లో జాతీయ క్రీడలు జరిగాయి! మరి బాబుగారిని కీర్తించే మూడ్ లో ఉన్న మంత్రిగారు జాతీయ క్రీడలను కాస్తా ఒలింపిక్స్ గా చెప్పారు. తమ ఆధ్యర్యంలో ఒలింపిక్స్ ఘనంగా జరిగాయని చెప్పుకొచ్చారు! ఇంకేముంది.. సభలో పార్టీలకు అతీతంగా అందరి సభ్యులవి నవ్వులే నవ్వులు!

మరింత సమాచారం తెలుసుకోండి: