ఆంధ్రప్రదేశ్ లోని కాపులందరికీ ముఖ్యమంత్రి చిన్న రాజప్పేనని అంటున్నారు కాపు సంఘం నేతలు. ఏపీకి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ కాపులకు మాత్రం ముఖ్యమంత్రి చిన్నరాజప్పేనని ఏలూరులోని కాపు సంఘం నేతలు స్పష్టం చేశారు. కాపుల వల్లనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని.. టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చింది పవన్ కల్యాణేనని వాళ్లు అంటున్నారు. మరి తెలుగుదేశం పార్టీ ఏ మాత్రం ఇష్టపడని చర్చ ఇది. తెలుగుదేశం గెలిచింది.. కానీ ఎలా గెలిచింది? ఎవరి వల్ల గెలిచింది? అనే విషయాల గురించి చర్చ ను తెలుగుదేశం ఇష్టపడం లేదు. ఈ విజయంలో పవన్ కు క్రెడిట్ ను ఇవ్వడానికి కానీ.. ఇవ్వకపోవడానికి కానీ తెలుగుదేశం పార్టీ ఏ మాత్రం ఇష్టపడం లేదు. ఎందుకంటే.. భవిష్యత్తులో ఏంజరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఇప్పడు పవన్ కు క్రెడిట్ ఇస్తే ఒక తలనొప్పి.. ఇవ్వకపోతే మరో తలనొప్పి. అందుకే ఇలా తెలుగుదేశాన్ని గెలిపించింది పవన్ కల్యాణే అని ఎవరైనా అన్నా... అసలు తెలుగుదేశానికి కాపులే అసలైన లీడర్లు.. చంద్రబాబు డమ్మీ అని మరెవరైనా అన్నా... బాబు గెలుపు వెనుక "పవర్'' ఉందనే అభిప్రాయాలు వినిపించినా.. టీడీపీ సైలెంట్ గా ఉండాల్సిందే! అయితే సోషల్ సైట్లలో మాత్రం ఈ విషయంపై పెద్ద చర్చే నడుస్తోంది. బాబు విజయం వెనుక పవర్ ఉందని కొంతమంది.. అదేం కాదు.. మున్సిపల్, జడ్పీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ప్రచారం చేయకపోయినా తెలుగుదేశం గెలిచింది కదా.. అని మరికొందరు వాదించుకొంటున్నారు. మరి టీడీపీ విజయంలో కాపుల,పవన్ పాత్ర ఎంత?!

మరింత సమాచారం తెలుసుకోండి: