ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వాడీ వేడీగా కొనసాగుతుంది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ రైతు సమస్యలపై చంద్రబాబుపై ద్వజమెత్తారు. చంద్రబాబు పాలన కంటే వైయస్ పాలనలోనే అభివృద్ధి జరిగిందని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు ప్రతిపక్ష వైయస్ జగన్ సోమవారం అసెంబ్లీలో అన్నారు. వైయస్ తర్వాత వచ్చిన ప్రభుత్వాల పాలనలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. తొమ్మిదేళ్ల బాబు హయాంలో 21,994 కోట్ల రెవెన్యూ లోటు రాష్ట్రానికి వచ్చిందన్నారు. కానీ వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రానికి మిగులు బడ్జెట్ వచ్చిందన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబుకు కేవలం 53 మార్కులే వచ్చాయని, కానీ, 2004 నుంచి 2009 మధ్య పాలనలో ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖర్ రెడ్డి అమోఘంగా 90 మార్కులు తెచ్చుకున్నారన్నారు. 2009-2014 మధ్య రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం 68 మార్కులు తెచ్చుకుందన్నారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ జగన్ చెప్పేవన్నీ అసత్యపు లెక్కలన్నారు. చంద్రబాబు వైయస్ పాలనల మధ్య వ్యత్యాసాలపై మాట్లాడటానికి సొంత లెక్కలు వద్దన్నారు. తాము జగన్ మాదిరి సభ నుంచి పారిపోయే వారం కాదని జగన్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: