వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రయోగం చేసింది.విపక్ష నేతగా ఉన్న తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రసంగం చేస్తున్నప్పుడు ఎన్నిసార్లు ఎంతెంత సేపు అడ్డుపడింది వివరిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.దాని ప్రకారం పద్నాలుగుసార్లు టిడిపి మంత్రులు,ఎమ్మెల్యేలు ఏభై రెండు నిమిషాల సేపు అడ్డుపడ్డారని ఆ పార్టీ ప్రకటించింది.దాని ప్రకారం మంత్రులు యనమల రామకృష్ణుడు నాలుగుసార్లుగా పదిహేను నిమిషాలు, అచ్చెన్నాయుడు రెండుసార్లుగా తొమ్మిది నిమిషాలు,ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి నాలుగు నిమిషాలు,ప్రత్తిపాటి పుల్లారావు మూడు నిమిషాలు,రావెల కిషోర్ ఐదునిమిషాలు, ఛీప్ విప్ కాల్వ శ్రీనివాసులు నాలుగు నిమిషాలు,ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర రెండుసార్లుగా ఎనిమిది నిమిషాలు,జగన్ ప్రసంగంలో అడ్డుపడి తమ ప్రసంగాలు చేశారని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఒక ప్రకటనలో తెలిపింది. గతంలో ప్రతిపక్ష పార్టీ ఇలా అదికార పక్షం నేతలు ఎన్నిసార్లు అడ్డుపడింది, ఎంత సేపు మాట్లాడిన వివరాలు ఇవ్వలేదు.ఇది మొదటి సారి అని చెప్పాలి.దీనివల్ల స్పీకర్ కోడెల పై ఒత్తిడి పెంచే అవకాశం ఉంది.విపక్ష నేత మాట్లాడుతున్నప్పుడు ఇలా అదికార పక్షానికి అవకాశం ఇస్తే, ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నప్పుడు కూడా తమకు కూడా ఇవ్వవలసి ఉంటుందని జగన్ ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు.దానికి ప్రాతిపదికను పార్టీ సిద్దం చేసిందని భావించాలి. ఇంతకుముందు పందొమ్మిది సార్లు తమపట్ల అన్ పార్లమెంటరీ పదాలు వాడారని పేర్కొన్న వైఎస్ ఆర్.కాంగ్రెస్ ఇప్పుడు టిడిపి నేతలు ఎన్నిసార్లు అడ్డుకుంది లెక్కబెట్టారు. మొత్తం మీద ఇది వెరైటీగానే ఉంది

మరింత సమాచారం తెలుసుకోండి: