మన ప్రజాస్వామ్య క్షేత్రంలో.. చట్ట సభల్లో.. రాజకీయ పార్టీలు వాకౌట్ చేయడం కొత్త కాదు. దశాబ్దాలుగా దేశంలోని ప్రతి చట్టసభలోనూ ఇది జరిగే పనే. సభా కార్యకలాపాటు అధికార పార్టీకి అనుకూలంగా జరిగిపోతున్నప్పుడు... తమ మాటను పట్టించుకోనప్పుడు ప్రతిపక్ష పార్టీలు సభ నుంచి వెలుపలికి వచ్చి నిరసనను తెలపడం సహజంగా జరిగే విషయమే. సీరియస్ గా తీసుకొంటే.. ప్రతిపక్ష పార్టీ బయటకు రావడం అధికార పార్టీకే అవమానం! సభను ఏకపక్షంగా నడిస్తున్న... తమ లోపాలను చర్చలోకి రాకుండా చేస్తున్న అధికార పక్షాలే చట్టసభలో ప్రతిపక్ష పార్టీ బయటకు వెళ్లే పరిస్థితులను కల్పిస్తున్నాయి... అనే భావనను కలిగిస్తుంది వాకౌట్ అనేది. అయితే మన ప్రజాస్వామ్యంలో అంత సెన్సిటివిటీ లేదు. అందుకే ప్రతిపక్ష పార్టీలు వాకౌట్ లు చేసినా.. బల్లలు ఎక్కి నిరసనలు తెలియజేసినా... అది పట్టించుకోవాల్సిన అంశంగా అనిపించడం లేదు. అయితే తెలుగుదేశం వాళ్లు ఇంతకన్నా భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ వాకౌట్ చేసి తమ నిరసనను తెలిపితే.. అది పారిపోవడం అని అంటున్నారు! తమను చూసి భయపడి జగన్ పారిపోయాడు అని వ్యాఖ్యానిస్తున్నారు. మరి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న గత పదేళ్లలో వాళ్లు ఎన్ని సార్లు వాకౌట్ చేశారు? అనే విషయాన్ని కూడా ఇప్పుడు పరిశీలించాల్సి వస్తోంది. మరి వాకౌట్ చేయడమే పారిపోవడం అయితే... తెలుగుదేశం ఎన్ని సార్లు పారిపోయినట్టు?! ఈ విషయం గురించి వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి తెలుగుదేశం నేతలకు చురకలంటించాడు. ప్రత్యేకించి ఎంతో సీనియర్ నేత అయిన యనమల రామకృష్ణుడు వైకాపా వాకౌట్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని జగన్ ప్రస్తావించాడు. " అధ్యక్షా.. పాపం శాసనసభ వ్యవహారాల మంత్రి గారికి వాక్ అవుట్ అంటే ఏంటో తెలియదనుకుంటా,.. వాక్ అవుట్ అనేది ఎవరి అనుమతి తోనో చేసేది కాదు, నిరసన తెలుపుతూ ప్రతిపక్షం సభ నుండి బయటకు వెళ్ళిపోవడం... అది పారిపోవడం అవుతుందా?'' అని జగన్ యనమలకు పంచ్ వేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: