అవశేష ఆంధ్రప్రదేశ్‌ కి సంబంధించి చంద్రబాబునాయుడు ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన 2014-15 బడ్జెట్‌లో వాస్తవికత లేదనే అభిప్రాయం ఆర్థిక రంగ నిపుణుల్లో వ్యక్తమవుతోంది. కేవలం ఆరు నెలల కాలానికి 1,11,823 కోట్ల రూపాయల మేర బడ్జెట్‌ అవసరం ఉంటుందా అనేది సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఇందులో ప్లాన్‌ కింద 26,673 కోట్ల రూపాయలు కాగా, నాన్‌ ప్లాన్‌ కింద 85,151 కోట్ల రూపాయల చొప్పున అంచనా వేశారు. కేవలం కేంద్రం నుండి అధిక మొత్తంలో నిధులు రాబట్టేందుకే భారీ స్థాయిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే భారీగా నిధుల అవసరం ఉంది. ఇప్పటికే రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉన్న నేపథ్యంలో ఎన్నికల హామీలు, వాగ్దానాలను నెరవేర్చడం చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యమయ్యే పని కాదు. ఎన్నికల హామీలు, వాగ్దానాలను నెరవేర్చకపోతే ప్రతిపక్షాల నుండి తీవ్ర నిరసన, విమర్శలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుందని, ఇందువల్ల ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఏర్పడుతుందని భావిస్తోన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం అందుకు కేంద్రం నుండి భారీగా ఆర్థిక సహాయాన్ని ఆశిస్తోంది. ఇందుకు భారీగా బడ్జెట్‌ అంచనాలను రూపొందించాల్సిన అవసరం ఏర్పడిందని ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారవర్గాలు సైతం అంగీకరిస్తున్నా యి. కాగా ఇప్పటికే ఫిబ్రవరి నెలలో శాసనసభ 2014-15 ఆర్థిక సంవత్సరానికిగాను 1,83,129 కోట్ల రూపాయలతో ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ఆమోదించింది. రాష్ట్ర విభజన జరిగిన జూన్‌ 3వ తేదీ తదుపరి నాలుగు నెలల కాలానికి ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ నుండి ఆంధ్రప్రదేశ్‌ రాషా్టన్రికి 36,595 కోట్ల రూపాయలను ఆ రాష్ట్ర కొత్త ఎకౌంట్‌లో ఉన్నతాధికార్లు జమచేశారు. ఇందులో ఉద్యోగుల వేతనాలు, ప్రభుత్వ నిర్వహణ నిమిత్తం 28,626 కోట్ల రూపాయలు కాగా, ఆస్తుల కల్పనకు 3,046 కోట్ల రూపాయలను ఖర్చు చేసుకునే వెసులు బాటును కల్పించారు. ఈవిధంగా జూన్‌ నెల నుండి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్‌ నిమిత్తం నెలకు మొత్తం 3,304 కోట్ల రూపాయలు చొప్పున జూన్‌, జూలై నెలలకు 6,608 కోట్ల రూపాయలను ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ నుండి విడుదల చేసిన నిధుల నుండి ఖర్చు చేశారు. మిగిలిన 29,987 కోట్ల రూపాయల్లో నిర్వహణ, అత్యవసర పనులకు వినియోగించే వెసులుబాటు ఉంది.మరోపక్క జూన్‌ నెల నుండి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇప్పటి వరకూ ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలు ఏవీ అమలు కాలేదు. ఒక్క రేషన్‌ సరుకులు, అంతంత మాత్రంగా ఒక నెలకు సామాజిక పెన్షన్లను మాత్రమే ఆ రాష్ట్రప్రభుత్వం పంపిణీ చేసింది. జలయజ్ఞం, బలహీనవర్గాల గృహ నిర్మాణం, బంగారుతల్లి వంటి మిగిలిన పథకాలు ఏవీ ఎక్కడా అమలు జరుగ లేదనేది అధికారవర్గాలే వెల్లడిస్తున్నాయి. ఈనేపథ్యంలో నాలుగు నెలల కాలానికి ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్టెట్‌ నిధులు ఉండగా, కేవలం ఆరు నెలలకు 1,11,823 కోట్ల రూపాయల మేర బడ్జెట్‌ అవసరం ఏమిటనేది ప్రశ్నార్థకంగా తయారైంది. అయితే కేంద్రం నుండి అధిక నిధులను మంజూరు చేయించుకునేందుకు భారీగా కేటాయింపులు జరిపినట్లు అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టిన 2014-15 బడ్జెట్‌లో మొత్తం ఆదాయం 92,078 కోట్ల రూపాయలు వస్తుందని అంచనా వేసింది. ఇందులో రాష్ట్రం నుండి స్వంత పన్నులు తదితర ఆదాయం 37,398 కోట్ల రూపాయలుగా లెక్క కట్టింది. అయితే బడ్జెట్‌లో చూపిన మొత్తం ఆదాయంలో దాదాపు 60 శాతం కేంద్రం నుండి వస్తుందని అంచనాలు వేసింది. ఈవిధంగా కేంద్రం నుండి మొత్తం 45,668 కోట్ల రూపాయల చొప్పున ఆదాయం వస్తుందని పేర్కొంది. ఇందులో కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా 16,837 కోట్ల రూపాయలు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద 28,831 కోట్ల రూపాయలు వస్తుందని అంచనాలు కట్టింది. ఈ విధంగా అంచనా ఆదాయంలో అధిక భాగం కేంద్రంపైనే ఆధారపడిందనేది బడ్జెట్‌ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు బడ్జెట్‌లో సంక్షేమ రంగానికి సంబంధించి అన్న క్యాంటిన్లు, రెండు రూపాయలకు 20 లీటర్ల మంచినీరు, రైతులకు తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్‌ తదితర పధకాలను ప్రకటించారు. వీటన్నింటికీ భారీగా నిధులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఏర్పడి రాష్ట్రప్రభుత్వానికి కత్తిమీద సాములా అయ్యింది. అలాగే అవశేష ఆంధ్రప్రదేశ్‌ రాషా్టన్రికి రాజధాని నగరాన్ని ఇంకా ప్రకటించకుండానే ఈ బడ్జెట్‌ రావడం విశేషం. కృష్ణా-గుంటూరు మధ్య 200 ఎకరాల్లో ఎయిమ్‌‌స తరహా ఆసుపత్రి, జాతీయ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌, వ్యవసాయ యూనివర్సిటీ, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థలకు 1,010 ఎకరాల భూములను ప్రకటించారు. దీంతోపాటు తిరుపతిలో కేంద్రీయ విశ్వవిద్యాలయానికి, ఐఐటీ వంటి సంస్థలకు 800 ఎకరాలను కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. సినిమా పరిశ్రమ కోసం 1300 ఎకరాలను ఇప్పటికే కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ ప్రతిపాదనలన్నీ చంద్రబాబునాయుడు స్వయంగా పట్టుకెళ్లి ఢిల్లీలో ప్రధానమంత్రి దగ్గర క్లీయర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. బడ్జెట్‌లో చూపిన అంచనాల ఆదాయంతో పాటు ప్రత్యేక ప్రతిపత్తి, కొత్త రాజధాని నిర్మాణానికి కావాల్సిన నిధులు తదితర వాటికై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రమే దిక్కవుతోంది. ఈ పరిస్థితుల్లోనే భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్లు ఆర్థిక శాఖ అధికారవర్గాలు చెబుతున్నాయి. అయితే వీటన్నింటి దృష్టా్య చంద్రబాబునాయుడు పెట్టుకున్న ఆశలను కేంద్రం ఏమేరకు నెరవేర్చుతుందనేది సందిగ్దమే అవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: