టెక్నాలజీని ఉపయోగించడంలో మాకు పోటీ లేదు. టెక్నాలజీ తో ఏదైనా సాధిస్తాం అని చెప్పుకునే అమెరికాకు సైబర్ క్రిమినల్స్ షాక్ ఇచ్చారు. గత నెల రోజులుగా అమెరికా లోని ఐదు బ్యాంకులపై వరుసగా ఎటాక్ చేస్తున్నారు. ఇందులో జేపీ మోర్గాన్ చేజ్ లాంటి పెద్ద సంస్థలు కూడా ఉన్నాయి. బ్యాంకుల నెట్ వర్క్ లోకి చొరబడ్డ హ్యాకర్స్ , పర్సనల్ సేవింగ్స్ అకౌంట్స్, బ్యాంకులకు సంబంధించిన గిగా బైట్ల ఇన్ఫర్మేషన్ ను హ్యాక్ చేశారు. దీనిపై కొన్ని వారాల నుండి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఎఫ్ బిఐ, బ్యాంకులకు సైబర్ సెక్యూరిటీ ని పెంచేందుకు ఎన్ని చర్యలు తీసుకున్నా, హ్యాకర్స్ ను మాత్రం ఆపలేక పొతున్నారు. హ్యాకర్స్ మనీ కోసం చేస్తున్నారో, లేక శత్రు దేశాల ఇంటలిజెన్స్ ఏజెన్సీ కోసం పని చేస్తున్నారో ఎంక్వైరీ చేస్తున్నామని ఎఫ్ బిఐ అధికారులు చెప్తున్నారు. బ్యాంక్ నెట్ వర్క్స్ హ్యాక్ కాకుండా ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, హ్యాకర్స్ మాత్రం ప్రతి రోజు ఎటాక్ చేస్తున్నారు అని, జేపీ మోర్గాన్ చేజ్ బ్యాంక్ అధికారులు అన్నారు. అమెరికన్ బ్యాంకులపై రష్యా కు చెందిన సైబర్ క్రిమినల్స్ ఎటాక్ చేసే ఛాన్స్ ఉందని డల్లాస్ కేంద్రంగా పని చేసే ఒక ప్రైవేట్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ ఈ సంవత్సరం స్టార్టింగ్ లోనే హెచ్చరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: