శివరామకృష్ణన్ కమిటీ ఏమి చెప్పినప్పటికీ కృష్ణ,గుంటూరు జిల్లాల మధ్య రాజధాని ఉండాలని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తున్నట్లు కధనం.ప్రత్యేకించి కృష్ణ నదీ తీరం వెంబడి ఈ రాజధాని నిర్మాణం జరగాలన్న అబిప్రాయంతో ప్రభుత్వంలోని ముఖ్యులు ఉన్నారని అంటున్నారు. నందిగామ,అచ్చెంపేట,కంచికచర్ల, అమరావతి ల మధ్య కొత్త గా కృష్ణా నది పై వంతెనలు నిర్మించడం, రైతులనుంచి నలభై ,అరవై నిష్పత్తిలో భూమి సేకరించడం వంటి వాటి ద్వారా రాజధాని నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు సమాచారం.అయితే సెప్టెంబరు ఒకటిన మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించాలని భావించారు.శివరామకృష్ణన్ కమిటీ నివేదిక అధికారికంగా అందాక స్పందించవచ్చని,అంతవరకు భిన్న ప్రకటనలు చేయవద్దని చంద్రబాబు మంత్రులకు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: