తెలంగాణ కాంగ్రెస్ నేతలకు అదిస్టానం పరీక్ష పెడుతోంది.మెదక్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అంతా కలిసి పనిచేయాలని, వారంతా మెదక్ నియోజకవర్గం లోనే ఉండాలని ఆదేశించింది.దేశంలోని వివిధ ప్రాంతాలలో కాంగ్రెస్ కు ఆశాజనకమైన ఫలితాలు రావడంతో మెదక్ పై దృష్టి కేంద్రీకరించిందని చెబుతున్నారు.ఎఐసిసి కార్యదర్శి కుంతియా కూడా ఇక్కడే ఉండి నాయకులపై పర్యవేక్షణ చేస్తారు.కాగా టిఆర్ఎస్ పట్ల ప్రజలలో వ్యతిరేకత కనబడుతోందని,దానిని వాడుకోవాలని పొన్నాల అన్నారు.ప్రత్యేకించి రుణమాఫీ, విద్యుత్, కరవు తదితర సమస్యలను ఎత్తిచూపి టిఆర్ఎస్ ను ఇరకాటంలో పెట్టాలని పోన్నాల కోరారు.తెలంగాణ కాంగ్రెస్ నాయకులంతా మరి దీనికి సిద్దమవుతారా?ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలను కోల్పోయిన తెలంగాణ కాంగ్రెస్ ఏ ప్రభావం చూపుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: