తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన తుమ్మల నాగేశ్వర రావుకు మంత్రి పదవి ఖాయమైందని వార్తలు వస్తున్నాయి. ఈ షరతు మీదే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరాడనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. చాలా రోజులు చర్చల అనంతరం తుమ్మల నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితి లో చేరాడు. ఈ సంధీ కాలంలో తుమ్మలకు దక్కాల్సిన వాటి గురించి చర్చలు జరిగాయని విశ్లేషకులు అంటున్నారు. ముందుగా క్యాబినెట్ విస్తరణలో తమ్మలకు మంత్రి పదవి ఇవ్వడం.. తర్వాత ఆయనను ఎమ్మెల్సీగా చేయడం అనేది ఒప్పందమని తెలుస్తోంది. మరి తుమ్మల నాగేశ్వర రావుకు కేసీఆర్ క్యాబినెట్ లో మంత్రి పదవి దక్కితే అది ఆసక్తికరమైన అంశమే అవుతుంది. గతంలో చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రిగా చేసిన ఆయన ఇప్పుడు కేసీఆర్ క్యాబినెట్ లో మంత్రి అయితే.. రెండు రాష్ట్రాల్లో, ఇద్దరు భిన్న పార్టీలకు చెందిన ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా చేసిన ప్రత్యేకత తుమ్మల సొంతం అవుతుంది. ఒకవైపు ఏపీలో వైఎస్ క్యాబినెట్ లో మంత్రులుగా చేసిన కొంతమంది ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో భాగమయ్యారు. వారిలో కొంతమంది మంత్రి పదవుల కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. వైఎస్ క్యాబినెట్ లోనూ, చంద్రబాబు క్యాబినెట్ లోనూ మంత్రి పదవులు పొందిన ఘనతను సొంతం చేసుకోవడానికి వారు యత్నిస్తున్నారు. అయితే వారు దాన్ని సాధించుకొన్నా... ఆంధ్రప్రదేశ్ లో రెండు పార్టీల తరపున , ఇద్దరు ముఖ్యమంత్రుల వద్ద పనిచేసిన వారు మాత్రమే అవుతారు. అయితే తుమ్మల మాత్రం రెండు రాష్ట్రాల క్యాబినెట్ లో, ఇద్దరు ముఖ్యమంత్రుల వద్ద చేసిన వ్యక్తి అవుతాడు. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న హరీశ్ రావు కూడా గతంలో వైఎస్ క్యాబినెట్ లో పనిచేశాడు. ఇప్పుడు కేసీఆర్ క్యాబినెట్ లో పనిచేస్తున్నాడు. మరి ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపునపోటీ చేయకపోయినా... తెలంగాణ ఉద్యమాల్లో మరీ గొప్పగా పాల్గొన్నదేమీ లేకపోయానా... తీరా ప్రభుత్వం ఏర్పడ్డాకా ఆ పార్టీలో చేరి మంత్రి పదవిని సాధించుకొంటే తుమ్మల ది అదృష్టవంతుడని చెప్పాలేమో!

మరింత సమాచారం తెలుసుకోండి: