ఒకవైపు కాంగ్రెస్ నేతలు ప్రజాదరణ కోల్పోయినా వాళ్లకు పాలకవర్గంపై పట్టు మాత్రం అలాగే ఉనట్టుంది. ఎన్నికల్లో చిత్తుగా ఓడిన ఘనత వహించినవీళ్లకు ఇప్పుడు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు డాక్టరేట్ల ప్రదానం చేస్తున్నాయి. రాష్ట్ర విభజనకు కారణమయ్యారని ప్రజల చేత తిరస్కరణకు గురైన నేతలను గౌరవ డాక్టరేట్లతో సత్కరిస్తున్నాయి. పొలిటికల్ వార్తల్లో లేకుండా పోయిన ఈ నేతలు ఇప్పుడు ఈ విధంగా వార్తల్లోకి వస్తున్నారు. ఈ నెల 29 వ తేదీన జరగనున్న ఆంధ్ర యూనివర్సిటీ స్నాతకోత్సవంలో కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, రాష్ట్ర మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ లకు గౌరవ డాక్టరేట్లు ఇవ్వనున్నారని సమాచారం. మరి ఇప్పుడు వీళ్లకు ఈ సత్కారం ఎందుకు? అంటే.. ఎవరూ ఏమీ చెప్పలేని పరిస్థితి. డాక్టరేట్లు ఇచ్చుకొనే అధికారం యూనివ ర్సిటీలకు ఉంది... తీసుకొనే హక్కు ఎవరికైనా ఉంది. ఇక స్థాయి, సాధించిన వ్యవహారాలతో పనేంటి?! అను కోవాల్సి వస్తోంది! ఒకవైపు రాష్ట్రం విడిపోవడంపై బాధతో ఉన్న ప్రజలు కాంగ్రెస్ అంటనే ఇంకా మండి పడుతూనే ఉన్నారు. రాష్ట్ర విభజనకు కారణం వాళ్లేనని వారు అంటున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన శాస్తి జరిగిందని అనే వాళ్లూ ఎక్కువమందే ఉన్నారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను వారి సమైక్య కాంక్షను పరిగణనలోకి తీసుకోకుండా రాష్ట్రాన్ని విడదీసిన కాంగ్రెస్ కు ఇక సీమాంధ్రలో ఇక లైఫ్ లేదని... ఇక ఆ పార్టీ ఆ ప్రాంతంలో కోలుకొనే అవకాశాలే ఉండవని వారు అంటున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఇలా కాంగ్రెస్ నేతలకు ఆంధ్రా యూనివర్సిటీ డాక్టరేట్లు ప్రదానం చేయడం... వారిని సత్కరించాలని అనుకోవడంపై సహజంగానే సమైక్యవాదుల్లో ఆగ్రహాన్ని కలగజేస్తుంది. అయితే ఇది యూనివర్సిటీ వ్యక్తిగత వ్యవహారం కాబట్టి.. ఇందులో రాజకీయాలకు చోటు లేదని విశ్లేషకులు అంటున్నారు. మరి ఏ రాజకీయమూ లేకుండానే డాక్టరేట్లు ఇస్తున్నారా?!

మరింత సమాచారం తెలుసుకోండి: