ఆంధ్రప్రదేశ్‌ను ఆధ్యాత్మిక ఆంధ్రగా తీర్చిదిద్దేందుకు ఎనిమిది పర్యాటక సర్క్యూట్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఒకటవ విభాగంలో పంచారామాలు భీమవరం, పాలకొల్లు, అమరావతి, ద్రాక్షారామం, సామర్లకోట, రెండవ విభాగంలో శక్తిపీఠాలు విజయవాడ, పిఠాపురం, శ్రీశైలం, మూడవ విభాగంలో నృసింహ క్షేత్రాలు సింహాచలం, అంతర్వేది, మాల్యాద్రి నృసింహ ఆలయం (ప్రకాశం జిల్లా), వేదాద్రి (కృష్ణా జిల్లా), పెంచలకోన (నెల్లూరు), మంగళగిరి, అహోబిలం, నాల్గవ విభాగంలో శ్రీకూర్మం, శ్రీముఖ లింగం, అరసవల్లి, సింహాచలం, విశాఖలోని కనకమహాలక్ష్మి, సంపత్ వినాయక ఆలయాలు, ఆరవ విభాగంలో మహానంది, కాల్వబుగ్గ, నందవర, యాగంటి, అహోబిలం, ఎనిమిదవ విభాగంలో శ్రీకాళహస్తి, శ్రీనివాస మంగాపురం, నాగలాపురం, కాణిపాకం, నారాయణవనం ఉన్నాయి. ఆలయాల్లో పుష్కరిణులను ఆధునిక వసతులతో తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అర్చకుల సంక్షేమానికి ఒక నిధిని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: