అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అక్రమాలు చేయడానికి కొందరు అలవాటు పడుతున్నారు.ఎపిలోని తెనాలిలో కొందరు కొన్నివేల కోట్ల రూపాయలను ఈ రకంగా దోపిడీ చేసినట్లు వచ్చిన కధనం ఒకటి సంచలనంగా ఉంది. తెనాలి సెంటర్ గా నకిలీ మల్టీ కమాడిటీస్ ఎక్స్సెంజ్(ఎంసీఎక్స్) ద్వారా ఆరువేల కోట్ల రూపాయల మేర ఇన్వెస్టర్ల సొమ్మును దోచుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నట్లు ఆ కధనం వెల్లడిస్తోంది.దీనిని మొత్తం అరవై మూడు సెంటర్లలో నిర్వహించారని,నెదర్లాండ్ ను ఆపరేషన్ కేంద్రంగా పెట్టుకున్నారని, ఎంసీఎక్స్ డూప్లికేట్ సర్వర్ ద్వారా అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు పోలీసులకు వర్తమానం అందిందని అంటున్నారు. మాజీ ఉద్యోగులపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.పోలీసులు విచారణ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: