మెదక్ లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నిక, నందిగామ శాషనసభ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు పోలింగ్ అంత జోరుగా సాగడం లేదు.ఉదయం పదకుండు గంటలవరకు మెదక్ లో పదిహేను శాతం,నందిగామలో పదకుండు శాతం మాత్రమే పోలింగ్ నమోదు అయింది. కొన్ని చోట్ల ఇవిఎమ్ లు మొరాయించడం,కొన్ని చోట్ల పోలింగ్ బూత్ లేదనో,లేక సమస్యలుతీర్చాలనో డిమాండ్ చేస్తూ గ్రామస‌్తులు బహిష్కరణ చేశారు.తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తన సొంత గ్రామమైన చింతమడక లో ఓటు హక్కు వినియోగించుకోగా, మంత్రి హరీష్ రావు సిద్దిపేటలో ఓటు వేశారు.గతసారి మెదక్ లోక్ సభ నియోజకవర్గ పరిదిలో అరవై ఏడు శాతం ఓట్లు నమోదు కాగా,ఈసారి అంత మాత్రం అయినా ఓటింగ్ నమోదు అవుతుందా అన్న సందేహం ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: