ధనాధన్ ఫార్మాట్ టీ20 మళ్లీ వచ్చేసింది. సిక్సర్లు, ఫోర్ల తో క్రికెట్ ఫాన్స్ ను అలరించడానికి మరో మెగా టోర్నీ రెడీ అయింది. శనివారం చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీ స్టార్ట్ కానుంది. ఇవ్వాళ్టి నుంచి మంగళవారం వరకు క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఫస్ట్ డే జరిగే క్వాలిఫయింగ్ మ్యాచ్‌లలో ముంబై ఇండియన్స్.. లాహోర్ లయన్స్‌తో, నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ టీం.. సదరన్ ఎక్స్‌ప్రెస్‌తో ఆడనున్నాయి. ఇందులో కేవలం రెండు టీం లు మాత్రమే ప్రధాన టోర్నీ కి అర్హత సాధిస్తాయి. బుధవారం జరిగే ప్రధాన పోటీల ఫస్ట్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఎదుర్కొంటుంది. క్వాలిఫయింగ్ రౌండ్‌లోని ఇతర మూడు జట్లతో పోలిస్తే అన్ని రకాలుగా ముంబై ఇండియన్స్ స్ట్రాంగ్ గా ఉంది. డిఫెండింగ్ చాంపియన్ కూడా అయిన ముంబై టీం లో హస్సీ, మలింగ, హర్భజన్, ఓఝా, కోరె అండర్సన్ లాంటి డాషింగ్ ప్లేయర్స్ తో పాటూ లెండిల్ సిమన్స్, రాయుడు, ఆదిత్య తారేలాంటి టి20 స్పెషలిస్ట్ లు ఉన్నారు. అయితే రోహిత్ శర్మ గాయంతో టోర్నీ నుండి తప్పుకోవడం ముంబైకి ఇబ్బంది కల్గించే అంశం. లాహోర్ లయన్స్‌కు మ హ్మద్ హఫీజ్, సదరన్ ఎక్స్‌ప్రెస్‌కు కుశాల్ పెరీరా, నార్తర్న్ డిస్ట్రిక్స్‌కు డానియల్ ఫ్లెన్ కెప్టెన్ గా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: