తిష్ఠాత్మక ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్‌ యూనియన్‌(డీయూఎస్‌యూ) ఎన్నికల్లో బీజేపీ అనుబంధ విద్యార్థి విభాగం.. అఖిల భారతీయ విద్యార్థి ప రిషత్‌(ఏబీవీపీ) విజయ ఢంకా మోగించింది. 18 ఏళ్ల తర్వాత.. అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్‌ అను బంధ నేషనల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌ఎస్‌యుఐ)పై ఏబీవీపీ అభ్యర్థులు తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించారు. దీంతో డీయూఎస్‌యూ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి, సహకార్యదర్శి పదవులు ఏబీవీపీ వశమయ్యాయి. అధ్యక్షుడిగా మోహిత్‌ నగర్‌, ఉపాధ్యక్షుడిగా ప్రవేశ్‌ మాలిక్‌, కార్యదర్శి, సహ కార్యదర్శులుగా కని క షెఖావత్‌, అశుతోష్‌ మాథుర్‌ ఎన్నికయ్యారు. ‘‘ఇదంతా మోదీ ప్రభావమే. నాలుగేళ్ల డిగ్రీ కోర్సును రద్దు చేస్తామని ఇచ్చిన హామీని ఏబీవీపీ నెరవేరుస్తుంది’’ అని అధ్యక్షుడిగా ఎన్నికైన మోహిత్‌ ప్రకటించారు. మోదీ ‘వేవ్‌’ తమ గెలుపునకు కారణమని ఏబీవీపీ జా తీయ కార్యదర్శి రోహిత్‌ తెలిపారు. యూనివర్సిటీ ఎన్నికల్లో విజయం సా ధించిన ఏబీపీవీ నాయకులకు బీజేపీ జాతీయ అ ధ్యక్షుడు అమిత్‌ షా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘నాలుగు విభాగాల్లోనూ జయకేతనం ఎగరేసిన ఏబీవీపీకి నా అభినందనలు. ఇది విద్యార్థులు, కార్యకర్తల సమష్టి విజయం’’ అని ట్వీట్‌ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: