గత రెండు రోజులుగా మలేషియాలో జరిగిన ‘సీమ’ అవార్డ్స్ ఫంక్షన్ కు వెళ్ళిన రెజీనా తన హాట్ లుక్స్ తో ఆవార్డ్స్ నైట్ కు హాట్ టాపిక్ గా మారింది అనే వార్తలు వస్తున్నాయి. మొన్న శుక్రు వారం విడుదల అయిన ‘పవర్’ సినిమా మలేషియాలో కూడ విడుదల కావడంతో మలేషియాలోని ‘పవర్’ ప్రదర్శింపబడుతున్న ధియేటర్ లోకి వెళ్ళి రెజీనా అక్కడ కూడ సందడి చేసింది అనే మాటలు వినపడుతున్నాయి. మంచి నటిగా ఇప్పటికే పేరు తెచ్చుకున్న రెజీనా గ్లామర్ హీరోయిన్ గా ఎదగడానికి తన ప్రయత్నాలను తన శక్తి వంచన లేకుండా చేస్తూ ఇలా ఏ సినిమా కార్యక్రమానికి హాజరైనా హాట్ లుక్స్ లో కనిపించడానికి ప్రయత్నిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా డ్రెస్సింగ్‌ స్టయిల్‌ విషయంలో తనదైన ప్రత్యేకతను చాటుకోవడానికి ప్రయత్నిస్తోంది రెజీనా. ‘సీమ’ అవార్డ్స్ నైట్ లో టైలరింగ్ టేప్ శారీ డిజైన్ తో ఒక వెరైటీ లుక్ తో వచ్చిన రెజీనా పై అవార్డ్స్ ఫంక్షన్ కు వచ్చిన అతిధుల దృష్టి పడితే రెజీనా కొలతల శారీని ఎక్స్ పోజ్ చేస్తూ మీడియా కెమెరాలు ఆమెను చుట్టుముట్టడం మలేషియాలో హాట్ టాపిక్.  

మరింత సమాచారం తెలుసుకోండి: