సాంకేతిక పరిజ్ఞాన రంగంలో నూతన ఆలోచనలతో వచ్చే ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భారీ ప్రణాళిక సిద్దం చేసింది. ఆలోచనలను పెట్టబడగా పెట్టేందుకు ముందుకు వచ్చి వారికి అవసరమైన మూలధన పెట్టుబడిగా సహాయం చేసేందుకు రూ.1000 కోట్లు అందుబాటులో పెట్టాలని భావిస్తోంది. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా మారేందుకు ముందుకు వచ్చే విద్యార్థులు , ఇంజనీరింగ్‌ పట్టభద్రుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 50 కొత్త ఆలోచన కేంద్రాలు(స్టార్‌ఆప్‌ విలేజీలు) ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే కేరళలోని స్టార్‌ అప్‌ విలేజిని సందర్శించి ఐటీ శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వ నమానా, లక్ష్యాలను సిద్దం చేశారు. కోచిలోని స్టార్‌ ఆప్‌ విలేజి తరహాలోనే రా„ష్ట్రం కొత్త ఆలోచనల కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ-ప్రైవేట్‌ భాగస్వామ్య పద్దతి ఇతర భారీ ఐటీ కంపెనీలు, వెంచర్‌ కేపిటల్‌, భాగాస్వామ్యల్లో 50 వరకు ఏర్పాటు చేస్తారు.ఈ కేంద్రాలు ప్రారభమైన మూడేళ్ళలో కనీసం 2500 ఆలోచనలు కార్యారూపం దాల్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్త ఆలోచనల కేంద్రం విస్తీర్ణం కనీసం లక్ష చదరపు అడుగులుగా ఉండాలని భావిస్తోంది. ఈ కేంద్రాల్లో ఆలోచనలతో ముందుకు వచ్చే వారి కోసం అవసరమైన నిధులను బడ్జెట్‌, ఇతర వెంచర్‌ కెపిటల్‌, తదితర మార్గాల ద్వారా సమీకరించనుంది. దాదాపు రూ.1000 కోట్లను ప్రత్యేక ఖాతాలో పెట్టి, అవసరమైన సహాయం చేస్తుంది, గుర్గావ్‌లోని 91 స్ప్రింగ్‌ బోర్డు,బెం గుళూరులోని అల్పాల్యాబ్‌, చెనై్నలో స్టార్‌ అప్‌ సెంటర్‌, హైదరాబాద్‌లో కో-చర్‌‌క జోన్‌, కోచిలోని స్టార్‌ అప్‌ విలేజిని అధ్యయనం చేయనుంది. కొత్త ఆలోచనలతో వచ్చే ఔత్సాహికులు సింగిల్‌ విండో విధానం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వ్యాట్‌, పురపాలక తదితర అనుమతులు ప్రభుత్వమే కల్పిస్తుంది. నూతన ఆలోచనకు అనుమతి లభిస్తే ఆ ఆలోచన ద్వారా జరిగే వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకుని కనీస రూ.15 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు పెట్టుబడి సహాయం కల్పిస్తారు. నూతన రాష్ట్రంలో యువతను వ్యాపార వేత్తలుగా తీర్చిదిద్ది ,వ్యాపార వృద్దికి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేయనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: