పాలనా పగ్గాలు చేపట్టి వంద రోజులు పూర్తి చేసుకొన్న సందర్భంగా తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించాడు. తన క్యాబినెట్ మంత్రులందరినీ పిలిపించుకొని సోమవారం ఆయన ప్రత్యేక క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించాడు. ఈ సందర్భంగా మంత్రుల పని తీరు గురించి చంద్రబాబు గ్రేడింగ్ లను ఇచ్చాడని తెలుస్తోంది. ఎవరు ఎంత బాగా పనిచేశారు.. ఎవరు తమ పనితీరును మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది.. అనే అంశాల గురించి బాబు ప్రసంగించినట్టు తెలుస్తోంది. ఇది వరకే బాబు తన మంత్రి వర్గంలోని సభ్యులకు ఇలాంటిది ఒకటుంటుందని చెప్పాడు. పనితీరు బాగా ఉండాలని.. అందరికీ ర్యాంకులు వేసి.. వారిలో ఎవరికి ప్రమోషన్ ఇవ్వాలి, ఎవరికి డిమోషన్ ఇవ్వాలనే అంశం గురించి సమీక్షిస్తానని చంద్రబాబు ముందు జరిగిన క్యాబినెట్ మీటింగుల్లోనే చెప్పాడు. మరి వంద రోజుల సందర్భంగా మంత్రుల పని తీరు గురించి అధికారికంగా సమీక్షించినట్టు తెలుస్తోంది. మరి వంద రోజులు పూర్తి అయినా పాలన ఎక్కడా ప్రారంభమైన దాఖలాలు ఏమీ కనపడటం లేదు. ఏ ఒక్క హామీ కూడా అమలు అయిన దాఖలాలు కనపడటం లేదు. బాబు ప్రభుత్వం ఒక్కో అంశం గురించి ఒక్కో సాకు చెబుతూ... విభజన కారణాలను చూపుతూ, ఆర్థిక లోటును చూపుతూ కాలం గడుపుతోందే కానీ.. ఇప్పటి వరకూ ఏ హామీని అమలుపెట్టి ఫలితాలను చూపలేదు. రుణమాఫీ వంటి హామీలను గురించి అయితే.. ఇప్పటికే అమలు చేశామని ప్రభుత్వం చెప్పుకొంటోంది. కానీ లబ్ధిదారుల స్థితిగతుల గురించి పరిశీలిస్తే ప్రభుత్వానివి ఉత్తుత్తి కబుర్లేనని స్పష్టంగా అర్థమవుతోంది. మరి ఈ వ్యవహారాలన్నింటి నేపథ్యంలో మంత్రుల ర్యాంకింగ్ ల మాట ఎలా ఉన్నా... చంద్రబాబు తనకు తాను ఎన్నో ర్యాంకును ఇచ్చుకొంటాడో!

మరింత సమాచారం తెలుసుకోండి: