మాజీ మంత్రి ,పిసిసి మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై మధ్యం కేసును తిరగదోడాలని ఎపి ప్రభుత్వం నిర్ణయించిందన్న సమాచారం ఆసక్తికరంగా ఉంది.కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు మద్యం కుంభకోణంలో ఇరుక్కున్నారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. సిండికేట్లు ఏర్పాటు చేయడం, మద్యం ధరలు పెంచడంలో కమిషన్లు వసూలు చేయడం, మద్యం షాపులనుంచి లంచాలు వసూలు చేయడం వంటి ఆరోపణలపై అప్పటి కిరణ్ సర్కార్ విచారణ చేయించింది. ఎసిబి విచారణ చేయించి నివేదిక సిధ్దం చేసింది.అందులో బొత్స పాత్రపై కూడా అబియోగాలు వచ్చాయి. అయితే అప్పట్లో కాంగ్రెస్ హై కమాండ్ జోక్యం చేసుకుని ఆ వ్యవహారాన్ని పక్కన పెట్టించిందని అంటారు. మళ్లీ ఇప్పుడు ఆ నివేదిక ఆధారంగా తిరిగి కేసును తిరగతోడితే బొత్స తో సహా పలువురు ఇబ్బందులలో పడతారా అన్నది చర్చనీయాంశంగా ఉంది. అయితే కొందరు టిడిపి నేతలు కూడా ఈ కేసులో ఇరుక్కునే అవకాశం ఉందని అంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: