ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఇంటి వ్యవహారం పోలీసు కేసుల వరకూ వచ్చింది. ఆయన కోడలు పద్మప్రియ స్పీకర్ ఇంట్లో వాళ్లందరిపైనే తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది. వాళ్లంతా తనను మానసికంగా వేధిస్తున్నారని ఆమె అంటోంది. తాజాగా ఆమె భర్త, స్పీకర్ తనయుడు ఆమె ఇంటికి వెళ్లి దాడి చేసి, కుమారుడిని కిడ్నాప్ చేసుకొచ్చాడనే విషయం మీడియాకు ఎక్కింది. తన కుమారుడిని తన భర్తే కిడ్నాప్ చేశాడంటూ కోడెల కోడలు పోలీసులు రిపోర్టు ఇచ్చింది. 2009లో తమ వివాహం అయ్యిందని, తర్వాత విభేదాలతో విడిపోయామని తను తన కుమారుడితో విశాఖలో ఉంటున్నానని పద్మప్రియ చెప్పింది. గతంలో తన భర్తతో కలిసి ఉన్నప్పుడే ఇంట్లో తనకు వేధింపులు ఉండేవని.. వాళ్ల కుటుంబీకులు అంతా తనను టార్చర్ పెట్టేవారని పద్మప్రియ ఆరోపించింది. ఆ వేదింపులు తాళలేక తను దూరంగా ఉంటున్నానని అయితే టీడీపీ అధికారంలోకి వచ్చాకా.. కోడెలకు పదవి వచ్చాకా తనకు మరింత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయని ఆమె చెబుతోంది. అప్పటినుంచి తనకు వేధింపులు ఎక్కువయ్యాయని ఆరోపిస్తోంది. ఇప్పుడు విశాఖలో ఉంటున్న తనపై దాడికి దిగి తన కుమారుడిని ఎత్తుకొని వెళ్లిపోయారని అంటూ ఆమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. మరి ఇది గౌరవనీయమైన ఆంధ్రప్రదేశ్ స్పీకర్ హోదా ఉండి.. రెండు బలమైన పక్షాలకు సర్ధి చెప్పాల్సిన స్థానంలో ఉన్న కోడెలకు ఇది ఇబ్బందకరమైన పరిస్థితే. ఆయన కుటుంబ వ్యవహారం ఇలా పోలీసులు వరకూ వెళ్లడం అంత గొప్పవిషయం కాదు. కుటుంబ అంతర్గత విషయాన్ని గుట్టుగా పరిష్కరించుకోవాల్సిందేమో!

మరింత సమాచారం తెలుసుకోండి: