హైదరాబాద్‌.. బెస్ట్‌ ప్లేస్‌ అంటున్నారు విదేశీ విద్యార్ధులు. యుద్ధాలు, అంతర్యుద్దాలతో రగులుతున్న పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాల నుంచి భాగ్యనగరంలో అడుగుపెడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రాణాలకు గ్యారెంటీ లేని చోట నుంచి ప్రశాంత జీవితంతో పాటు.. చదవుల కోసం నగరాన్ని ఏరికోరి వస్తున్నావారి సంఖ్య పెరుగుతోంది. పశ్చిమాసియా దాడులతో అట్టుడుకుతోంది.. సిరియాలో యుద్ధ మేఘాలు తొలగలేదు.. ఆఫ్గన్‌లో తాలిబన్‌ల పాలన పోయినా రాజకీయ అనిశ్చితి.. ఇంకా హెచ్చురిల్లుతున్న తీవ్రవాదం, ఇరాక్‌, ఇరాన్‌, ఆఫ్రికాలో రెచ్చిపోతున్న తీవ్రవాదులు. ప్రజల ప్రాణాలకు గ్యారెంటీ లేదు. యువత భవిత ప్రమాదంలో పడుతోంది. విద్యావంతులు కావాలన్న తపన.. ఉద్యోగాలు సంపాదించాలన్న ఆశలు నెరవేరడం లేదు. ప్రాణాలు కాపాడుకోవడం ప్రాధాన్యతగా మారింది. అందుకే విదేశాలకు పరుగులు తీస్తున్నారు. కుటుంబాలను వదిలి చదువుకోసం సరిహద్దులు దాటుతున్నారు. యుద్దాలు, అంతర్యుద్దాలతో రగులుతున్న దేశాల నుంచి చదువులు కోసం వస్తున్నవారిని భాగ్యనగరం కూడా ఆదరిస్తోంది. గత కొన్నేళ్లుగా నగరంలో విదేశీ విద్యార్ధులు పెరుగుతున్నారు. వీరంతా కూడా సిరియా, ఆఫ్గన్‌, గాజా, ఆఫ్రికా వంటి ప్రాంతాలకు చెందినవారే. ఆఫ్రికా నుంచి అధికంగా ఉంటున్నారు. ప్రశాంతమైన జీవితంలో పాటు.. తక్కువ ఖర్చుతోనే నగరంలో విద్య అందుతోంది. స్కాలర్‌షిప్‌లు ఇస్తున్నారు. దీంతో భాగ్యనగరానికి సమస్యాత్మక దేశాల నుంచి విద్యార్ధులు క్యూ కడుతున్నారు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ కల్చరల్‌ రిలేషన్స్‌ లెక్కల ప్రకారం ప్రతి ఏటా 3వేల మంది విదేశీ విద్యార్ధులకు స్కాలర్‌షిప్పులు అందుతున్నాయి. పైగా యూనివర్శిటీల్లో మెరుగైన విద్య అందుతోంది. సదుపాయాలు బాగున్నాయి. వచ్చే విద్యా సంవత్సరానికి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న 15వందల మందికి సీట్లు ఖరారు చేశారు. వీరంతా ఇరాక్‌, ఇరాన్‌, సిరియా, పాలస్తీనా, సిరియా, ఆఫ్రికా దేశాలకు చెందినవారే. నగరంలో ఉన్న వివిధ యూనివర్శిటీల్లో చేరేందుకు పోటీపడుతున్నారు. ఇక ప్రైవేటు విద్యాసంస్థల్లో కూడా చేరుతున్న వారూ ఉన్నారు. చాలా దేశాల్లో చదువు కంటే కూడా ప్రాణాలు కాపాడుకోవడం ప్రధానంగా మారింది. అలాంటి దేశాల నుంచి భాగ్యనగరాన్ని వెతుక్కంటూ వచ్చి చదువులకు సాగిస్తున్నారు. డిగ్రీలు చేతికందాక ఇక్కడే ఉద్యోగాలతో స్థిరపడ్డవారూ ఉన్నారు. దేశంలోని మిగతా నగరాలతో పోల్చితే పూనేతో పాటు.. హైదరాబాద్‌లో చదవులు పూర్తి చేసుకుని స్థిరపడేందుకు ఎక్కవగా ఇష్టపడుతుంటారు. అందుకే ఏటేటా నగరంలో విదేశీ విద్యార్ధుల సంఖ్య పెరుగుతోంది. యుధ్దమేఘాలు అలుముకున్న దేశాల యువతను భాగ్యనగరం తన ఒడిలోకి తీసుకుని ఆదరిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: