కేంద్ర మాజీ మంత్రి , ప్రస్తుత భారతీయజనతా పార్టీ నేత కావూరి సాంబశివరావుకు కోపం వచ్చింది. అదికూడా తమ మిత్రపక్ష పార్టీ నేత, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మీద. టీడీపీ ఎమ్మెల్యే అయిన చింతమనేని తన మనుషులకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని కావూరి ఆరోపించాడు. ఎన్నికల్లో తనకు అనుకూలంగా పనిచేయలేదనే సాకుతో చింతమనేని తన మనుషులను తక్కువ చేసి చూస్తున్నాడని కావూరి ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ వ్యవహారంలో చింతమనేని తీరును ఆయన తప్పు పట్టాడు. ఎన్నికలు అయిపోయాకా.. అన్ని మరిచిపోవాలని, అందరినీ తన వారిగా భావించాలని కావూరి హితబోధ చేశాడు. చింతమనేని తీరు సరికాదని కావూరి వ్యాఖ్యానించాడు. భారతీయ జనతా పార్టీలో చేరినప్పటి నుంచి టీడీపీ నేతలతో ఇలాంటి వాదాన్ని ఏదో ఒకటి పెట్టుకొంటూనే ఉన్నాడు కావూరి. ఇక మరో బీజేపీ నేత కృష్ణం రాజు కూడా తన మాటలతో వార్తల్లోకి వచ్చాడు. మెగాస్టార్ చిరంజీవిపై ఆయన విరుచుకుపడ్డాడు. చిరంజీవి అర్థం లేకుండా మాట్లాడుతున్నాడని కృష్ణం రాజు వ్యాఖ్యానించాడు. అటు మోడీ ప్రభుత్వం, ఇటు చంద్రబాబు ప్రభుత్వం వంద రోజుల పండగను జరుపుకోవడం గురించిచిరంజీవి విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ విధంగా మాట్లాడటం చిరంజవికి తగదని.. ఆయనకు అవగాహన లేదని కృష్ణం రాజు అన్నాడు. చిరంజీవికి సినిమాలు తప్ప మరేమీ తెలియదని.. వంద రోజుల పాలనను సెలబ్రేట్ చేయడంతో తప్పేముందని... కృష్ణం రాజు చిరంజీవిని ప్రశ్నించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: